సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసులో విచారణ.. దర్యాప్తులో కీలక విషయాలు..!

Publish Date:Jul 30, 2026

Advertisement

 

నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపండి అంటూ బాధితురాలి విజ్ఞప్తి..!  

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు, ఫిర్యాదులు తెరపైకి రావడంతో పోలీసులు దృష్టి సారించారు. ఇందు లో భాగంగానే జూబ్లీహిల్స్ డీసీపీ సీఐ శ్రీనివాసులు రెడ్డిని విచారించారు. మరోవైపు తనపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు ఉన్నతా ధికారులను ఆశ్రయించారు. తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆధారాలను కూడా అధికారుల ముందు ఉంచినట్లు ఆమె వెల్లడిం చారు.

“నాకు న్యాయం చేయండి.. నాపై జరుగు తున్న ప్రచారాన్ని ఆపండి” అంటూ బాధితురాలు ఉన్నతాధికారుల ముందు తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తనపై తప్పుడు ఆరోప ణలు చేస్తూ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా సీఐ శ్రీనివాసులు రెడ్డికి మద్దతుగా కొంతమంది పోలీసు అధికారులే తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, తనకు సంబంధించిన విషయాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ప్రచారాల వెనుక ఎవరున్నారు? ఎందుకు తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారు? అనే కోణంలోనూ విచారణ జర పాలని ఆమె కోరింది.

అంతేకాకుండా సీఐ శ్రీనివాసులు రెడ్డి బెదిరింపుల కారణంగా తాను లక్షల రూపాయలు చెల్లించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. తాను చేసిన ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించి, తన వద్ద ఉన్న ఆధారా లను విచారణలో భాగంగా పరిగణనలోకి తీసుకో వాలని ఆమె కోరింది.తన గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నా యంటూ అధికారుల ముందు బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తనపై వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక సీఐ శ్రీనివాసులు రెడ్డిపై చేసిన ఆరోపణలు, బాధితురాలు సమర్పిం చినట్లు చెబుతున్న ఆధారాలు, ఆమెపై జరుగుతున్నట్లు పేర్కొన్న నెగిటివ్ ప్రచారం.. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు లోతుగా దృష్టి సారించినట్లు సమాచారం. ఆరోపణల్లో వాస్తవం ఎంత? బాధితురాలు సమర్పించిన ఆధారాలు ఏ మేరకు నిజం? ఆమెపై ప్రచారం వెనుక ఎవరు న్నారు? అనే అంశాలపై విచారణ కొనసాగుతు న్నట్లు తెలుస్తోంది. 

తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే సీఐ శ్రీనివా సులు రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఉన్నతా ధికారులను కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసు శాఖలో విచారణ కొనసాగుతుండటంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు  శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ఆడియో లీక్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశారని బాధితురాలు ఆరోపించారు.అనంతరం రహస్యంగా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి, వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గర్భం దాల్చిన తర్వాత బెదిరించి అబార్షన్ చేయించారని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసు శాఖ విచారణ కొనసాగుతోంది. కేసులో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

CI Srinivasulu Reddy, Jubilee Hills CI, Jubilee Hills Police Station, Hyderabad Police, 
Hyderabad Crime News, Telangana Police, CI Suspension, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy

By
en-us Political News

  
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో
ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మెట్రో ప్రయాణం ఒక హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, సరాసరి మెట్రో స్టేషన్‌కు చేరుకుని సాధారణ ప్రయాణీకుడిలా క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణికుల మధ్య కూర్చుని పక్కన ఉన్న వారితో ముచ్చటించారు.
జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలోని ఎంపోరియాలో 1,000 ఎకరాల డేటా సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్‌లో చప్పట్లు కొట్టినందుకు లక్స్ క్లారిడ్జ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగ హక్కులు, 1 గిగావాట్ విద్యుత్ వివాదం మరియు ఈ సంచలన ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇక్కడ చదవండి!
గూగుల్ పేలోకి Gemini AI సాంకేతికతతో Ask Google Pay ఫీచర్ వచ్చింది. మీ ఖర్చులు, పొదుపు మార్గాలు మరియు CIBIL స్కోర్ వివరాలను 10 భారతీయ భాషల్లో సులభంగా తెలుసుకునే విధానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
AIG ఉమెన్స్ ఓపెన్ 2026 ప్రత్యక్ష ప్రసారాలు, నెల్లీ కోర్డా గ్రాండ్ స్లామ్ వేట, మియు యమషిత డిఫెండింగ్ రికార్డులు మరియు మ్యాచ్ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.
కాకినాడ జిల్లాకు చెందిన దర్జీ కుమారుడు మాల్తి అఖిలేశ్ సంచలన విజయం సాధించాడు. కెనడా ఏఐ సంస్థలో ఏడాదికి రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందిన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.