చర్చిలో కామక్రీడ.. 19మంది మహిళలకు వల.. ప్లే బాయ్‌గా పియానో ప్లేయర్..
Publish Date:Nov 9, 2021
Advertisement
అతనో పియానిస్ట్. పేరు విలియమ్స్. నల్గొండలోని ఓ చర్చిలో పియానో ప్లే చేస్తుంటాడు. చాలాకాలంగా అదే పని మీద ఉన్నాడు. దేవుడిపై భక్తితో కాబోలు అనుకున్నారంతా. కానీ, అతగాడి భక్తి.. రక్తిగా మారింది. ద్యావుడిపై ధ్యాసను.. మహిళల మీదకు షిఫ్ట్ చేశాడు. పియానో ప్లేయర్ కాస్తా.. ప్లే మ్యాన్‌గా మారాడు. కట్ చేస్తే.. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 19మంది మహిళలను మోసం చేశాడని తెలుస్తోంది. చర్చికి వచ్చే యువతులు, మహిళలే అతని టార్గెట్. ముందు పాటతో ఇంప్రెష్ చేస్తాడు. పియానో వాయిస్తూ.. ఫోజు కొడతాడు. ఆ తర్వాత అసలు వాయింపు స్టార్ట్ చేస్తాడు. తన సంగీతంతో ప్రేమ సరిగమలు పలికిస్తాడు. మాటలతో మభ్య పెట్టి.. మ్యూజిక్‌తో మతి చెదరగొట్టి.. మెళ్లిగా అసలు కార్యక్రమం మొదలుపెడతాడు. అలా అలా.. మొత్తం 19మంది విలియమ్స్ వలకు చిక్కారట. మేటర్ పెళ్లి వరకూ రావడంతో.. వాడి బాగోతం బట్టబయలైంది. పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటపడింది. 19మందిని ట్రాప్ చేసిన సంగతి తెలిసి.. పోలీసులే అవాక్కవుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. విలియమ్స్ వివాహితుడు. వాడి ఆగడాలు భరించలేక.. మొదటి భార్య విడాకులు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు కూడా ఆమె ఫిర్యాదుతోనే విలియమ్స్ కామక్రీడ వెలుగులోకి వచ్చింది. 19 మంది మహిళలను మోసం చేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. తనకు గుండెపోటు వచ్చిందంటూ విలియమ్స్ ఆస్పత్రిలో చేరాడు.
http://www.teluguone.com/news/content/church-pianist-cheated-19-women-39-126057.html





