Publish Date:May 27, 2013
చిరంజీవి మాజీ మెగాస్టార్.. అవును ఇప్పుడు చిరు సినిమా హీరోకాదు ఓ రాజకీయనాయకుడు.. అతికొద్ది కాలం కొనసాగిన ఓ పార్టీకి మాజీ అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కూడా.. సినిమా హీరోగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి రాజకీయనాయకునిగా మాత్రం వరుస ఫెయిల్యూర్స్‌నే చవి చూస్తున్నాడు..
ఒకప్పుడు చిరంజీవి మైక్ పట్టుకుంటే జనాలు ఇలవేసి గోల చేసేవారు.. అభిమానులు సీట్లో కుదురగా కూర్చోలేకపోయేవారు.. ప్రజలు సునామీలా పొటేత్తేవారు.. కాని ఇప్పుడు అంత సీన్ లేదు.. పంచ్ డైలాగ్స్‌తో అభిమానులకు ఉత్సాహాన్నిచే చిరు ప్రసంగాల్లో ఇప్పుడు ఆ పస కనిపించడం లేదు..
చిరు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఎప్పుడు విదేశి పర్యటనల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.. టూరిజం సదస్సులతో పాటు, కేన్స్ లాంటి కలర్‌ఫుల్ వేదికల మీద కూడా అలరిస్తున్నాడు.. కాని ఏ వేదిక మీదా చిరులో మునుపటి మెగాస్టార్ చరిష్మా కనిపించటం లేదు.. మాటల్లో అప్పటి పవర్, పంచ్ మచ్చుకైనా కనిపించటం లేదు..
తాజాగా తానా సభల్లో ప్రసంగించిన చిరు. తన మాటల్లో వాడి తగ్గిందని మరోసారి నిరూపించాడు.. తొలిసారిగా కేంద్రమంత్రి హోదాలో తానాకు హాజరైన చిరంజీవికి అదేస్థాయిలో ఘనంగా స్వాగతం పలికారు తానా నిర్వాహకలు.. తెలుగు మాటలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న ప్రవాస భారతీయులు చిరు ఏం మాట్లాడతాడాని ఎదురు చూస్తుంటే వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లాడు మెగాస్టార్..
హీరోగా ఏది మాట్లాడిన చెల్లుతుంది కాని.. ఓ మంత్రిగా రాజకీయనాయకుడిగా తనకంటూ కొన్ని పరిథులుంటాయని భావించిన చిరు.. తన మాటల్లో ఎక్కడ మునుపాటి వాడి వేడి కనిపించకుండ జాగ్రత్త పడుతున్నారు.. అయితే ఈ మాటలు చిరు రాజకీయ భవిష్యత్తుకు ఎంత వరకు ఉపయోగపడతాయోగాని ఆయన అభిమానులకు ఆయన రాకతో సభ మరింత సక్సెస్ అవుతుందనుకున్న నిర్వహకులకు మాత్రం నిరుత్సాహమే మిగిలింది..
చిరు మాటల్లో వాడి తగ్గడం కాంగ్రెస్ వర్గాల్లో కూడా కలవరం కలిగిస్తుంది.. ప్రస్థుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో జనాలను ఆకర్షించే ఎకైక నేతగా ఉన్న చిరు ప్రసంగాల్లో కూడా పస తగ్గిపోతే ఎలా అని తలలు పట్టుకుంటున్నారట.. ఇదిలాగే కొనసాగితే చిరు మాజీ మెగాస్టార్ అన్నది నిజమౌతుందంటున్నారు విశ్లేషకులు..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-39-23222.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.