అయ్యన్న పొలిటికల్ రిటైర్మెంట్.!

Publish Date:Sep 5, 2026

Advertisement

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.

పెరుగుతున్న వయస్సు కారణంగా శరీరం విశ్రాంతి కోరుతోందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ అయ్యన్న పాత్రుడు చెప్పారు. తన జన్మదినం సందర్భంగా నర్సీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. నర్సీపట్నంలో నిర్వహించిన తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్వయంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు తెలియజేశారు.

 మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధాన్ని ఉంది. ప్రతి ఏటా తన పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ ప్రజలు, అభిమానుల మధ్య జరుపుకునే ఆయన, ఈసారి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక ప్రకటన కూడా నర్సీపట్నంలోనే, అదీ తన పుట్టిన రోజు నాడే చేయడం విశేషం.  తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రజలు అందించిన మద్దతును ఈ సందర్భంగా ఆయన   గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, తనకు రాజ్యాంగబద్ధంగా మిగిలి ఉన్న మిగతా మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితం చేస్తానన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్ర ప్రగతికి ఈ సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తానని తెలిపారు.

సుదీర్ఘ ప్రజా జీవితం తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ నేతలు, శ్రేణులు గౌరవిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు, అందించిన నాయకత్వం చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన మార్గదర్శకత్వం ఎప్పుడూ పార్టీకి అందుబాటులో ఉంటుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.   ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలన్న అయ్యన్నపాత్రుడు తీసుకున్న నిర్ణయంతో  భవిష్యత్తులో నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. కాగా  రాజకీయాల నుంచి వైదొలగినప్పటకీ..  ప్రజలతో తన ఉన్న అనుబంధం ఎప్పటికీ చెక్కుచెదరదని అయ్యన్న ఈ సందర్భంగా చెప్పారు.   


[Chintakayala Ayyanna Patrudu Announce retirement,  AP Assembly Speaker, Political Retirement, Narsipatnam News, Telugu Desam Party, Telugu One]

By
en-us Political News

  
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.