బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత!

Publish Date:Nov 14, 2021

Advertisement

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత, పిల్లల మనసు తెలసుకుని మెలగాలి.. పిల్లలు పూలతోటలోని మొగ్గలాంటి వారు. వాళ్లను ప్రేమగా సాకాలి. నేటి బాలలే రేపటి పౌరులు. భావి భారత భాగ్య విదాతలు అని భారత తొలి ప్రధాని నెహ్రూ చాలా సందర్భాల్లో చెప్పారు.. నవంబర్ 14 తేదీన ఆయన పుట్టిన రోజు.. అదేరోజున బాలల దినోత్సవం జరుపుతారు.. చిన్న పిల్లల ద్వారానే మనం ప్రేమ సూత్రాన్ని మరింత బాగా అర్ధం చేసుకోగలం, పిల్లలు తెలివైన వారుగా ఎదగాలంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలు వినిపించాలి.

ఈ రోజు పిల్లలకు పండుగ రోజు లాంటింది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ దినోత్సవాన్ని ఈ నెల 20న జరుపుకుంటాయి. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఎక్కువ కాలం ఆ హోదాలో సేవలందించారు. ఆయనకు గులాబీ అన్నా పిల్లలన్నా ఎంతో మక్కువ. చెప్పలేనంత ఇష్టం.. 

స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప గొప్ప అనుభవాల్ని సంపాదించినం. కానీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం.
నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన చర్య అని మనం అర్ధం చేసుకోవాలి.
 పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదనేది వాస్తవం. తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులు వుంటాయనుకునే దూరదృష్టి నుంచి ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏం అంటే బుద్ది జివులనబడే వాళ్ళుకూడా- దారిద్య్రం, నిరుద్యగం, వివక్షత వంటి పరిస్థితుల్ని ముల కారణాలుగా పరిగణిస్తూ పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయారు.. అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. 
ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం..
భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించింది ఈ తీర్మానంలో బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కు వుంది. అని తెలియజేశారు. అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది.

తల్లితండ్రుల బాధ్యత మీద కూడా బాలల భవిష్యత్ ఆధారపడి వుంటది.. అవి క్రింద తెలిపిన విధంగా ఉండాలి..
సురక్షిత వాతావరణంలో పిల్లలు ఉండేలా చూడటం.
వీలున్నంత ఎక్కువగా పిల్లలతో సంభాషిస్తూ వారి మనసు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం.
పిల్లలకు సురక్షిత బాల్యమే కాక ఇంకా ఎన్నో రకాల హక్కులు ఉన్నాయని పెద్దలందరికీ తెలియజేసి, వాటిని సంరక్షించేలా చూడటం.
పిల్లలకి, వారి కుటుంబానికి వీలున్నంతగా సాయపడటం.
పిల్లల రక్షణకి ప్రమాదం కలిగించే వాటిని తెలుసుకుని, అలాంటి ప్రమాదాల నివారణకి కృషి చెయ్యటం.
అవసర సమయాల్లో పోలీసులకి / పిల్లల సంరక్షణా సంస్ధలకి ఫిర్యాదు చేసి అవసరమైన చట్టబద్ధ భద్రతని కలిగించటం. పిల్లలు కష్టపడుతున్నప్పుడు అది వారి ఖర్మ అని బావించకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఇబ్బందులతోనే పెరిగారు అన్న ఉదాసీనత ఉండకూడదు. ఇది మన సంప్రదాయం. ఎప్పట్నుంచో ఇలాగే జరుగుతోందన్న ధోరణి ఉండకూడదు. పేదరికం, లంచగొండితనం వల్లే పిల్లలకి బాధలు అన్న అలక్ష్య ధోరణి పనికిరాదు. పిల్లల కష్టాలకు తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబమే కారణం అన్న భావన సరైంది కాదు. ఆ పిల్లలకి మనకి ఏం సంబంధం లేదు అన్న ఉదాసీనతా కూడదు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఆటపాటలకు దూరంకాకుండా చూసుకోవాలి, గత 20 నెలలుగా కరోనా చేసిన విలయతాండవం అంత ఇంత కాదు.. చదువు మీద ద్యసాలేదు , ఆటలు అడలన్న ఉత్సాహం కూడా లేదు.. వీటికి తోడు స్మార్ట్ ఫోన్ లు వచ్చి వాటిలో వచ్చే ఆన్లైన్ క్లాస్ ల కంటే వాళ్ళు అడే వీడియో గేమ్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారు..  పిల్లల చదువు వారి భవిష్యత్ నీ దృష్టిలో పెట్టుకొని తల్లితండ్రులు కొందరు అప్పుచేసి మరి వేలల్లో డబ్బులు కర్చుపెట్టి స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చారు.. అదికాస్తా ఆన్లైన్ క్లాస్ లు ఏమో కానీ వీడియో గేమ్స్ లో బాలలు ఫోన్ లకు విపరీతంగా అకారితులై గ్రూప్ గా కలిసి ఎక్కువ సమయం ఫోన్ తో కలక్షేపం చేస్తూన్నారు. ఈ అలవాట్లను మెల్లిమెల్లిగా బాలలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి.. అదేవిదంగా కార్పొరేట్‌ స్కూల్ లో చదివించే తల్లితండ్రులు కార్పొరేట్ విద్యా సంస్థల మధ్య పోటీ కారణంగా బాలలు ఒత్తిడికి గురవుతున్నారు కావున వారితో ఎక్కువ సమయం గడుపుతే కొంత వరకు పలితాలు వస్తావి అనేది వాస్తవం .. కానీ ఎంత మంది తల్లితడ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు! 
తల్లిదండ్రులు కూడా ర్యాంకులు, మార్కులకే ప్రాధాన్యం ఇవ్వడంతో బాలల వికాసానికి దోహదపడే బాల సాహిత్యం మాటే వినిపించడం లేదు. నీతి కథలు, బాల సాహిత్య పుస్తకాల జోలికి వెళ్లే తీరికే ఉండడం లేదు.
చందమామ, పేదరాశి పెద్దమ్మ, కాశీ మజిలి కథలు, అక్బర్‌ బీర్బల్‌, అరేబియన్‌ నైట్స్‌ ఇలా ఏ పుస్తకం గురించి చెప్పినా నేటి తరం బాలలు తెల్ల ముఖం వేస్తారు. ఆటలు ఆడితే సమయం వృధా అవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు శారీరక వ్యాయామం లేకుండాపోయింది. సెలవు రోజుల్లో కూడా పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పరిస్థితి నెలకొంది. దీంతో బాలల ఒత్తిడికి గురవుతున్నారు. బాల్యంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు..

శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు,
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు,
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు,
తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు,
సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు
వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.

- పీలి కృష్ణ
7801004100

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.