వేళ్లు నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యం!

Publish Date:Jul 12, 2016

Advertisement

పిల్లలు తల్లి గర్భంలో ఉండగానే వారిలో వేళ్లను నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుందట. కానీ వారు బయట ప్రపంచంలోకి వచ్చి, పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ అలవాటుని మానుకోకపోతే పెద్దలు బెంబేలెత్తిపోతుంటారు. నయానోభయానో తమ పిల్లలలో ఈ అలవాటుని మాన్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం వారిని కొట్టడమో, వేళ్లకి బ్యాండేజీలు చుట్టడమో చేస్తుంటారు కూడా! కానీ ఆశ్చర్యకరంగా... పిల్లల్లో వేళ్లు చీకే అలవాటు మున్ముందు కొన్ని అనారోగ్య సమస్యలని దూరంగా ఉంచుతుందని ఒక పరిశోధన చెబుతోంది.

40 ఏళ్ల పరిశోధన!

పిల్లల్లో వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే దానివల్ల వారి పళ్లు దెబ్బతింటాయనీ, నత్తి వచ్చే ప్రమాదం ఉందనీ... అటు వైద్యులూ, ఇటు తల్లిదండ్రులూ కంగారుపడటం సహజం. కానీ న్యూజిలాండ్‌లో దాదాపు 40 ఏళ్లుగా జరుగుతున్న ఓ పరిశోధన ఇందుకు విరుద్ధమైన ఫలితాలను వెల్లడిస్తోంది. ఈ పరిశోధనలో భాగంగా నిపుణులు 1972-1973 సంవత్సరాల మధ్య పుట్టిన ఒక 1037 మంది పిల్లలను గమనిస్తూ వస్తున్నారు. ఎదుగుతున్న కొద్దీ ఆ పిల్లల్లో ఎలాంటి అలవాట్లు ఏర్పడుతున్నయో నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారిలో 5,7,9,11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరెవరిలో గోళ్లు కొరుక్కోవడం, వేళ్లు చప్పరించడం అనే అలవాట్లు ఉందో పరిశీలించారు.

తరువాతకాలంలో...

తాము పరిశోధన కోసం ఎంచుకున్న పిల్లలకి 13, 32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వారి మీద కొన్ని పరీక్షలు జరిపారు పరిశోధకులు. ఇందులో భాగంగా దుమ్ముకణాలు, పెంపుడు జంతువులు, ఇంట్లో కనిపించే సూక్ష్మక్రిములు... వంటివాటి నుంచి సదరు పిల్లలకు అలెర్జీలు సోకే అవకాశం ఏమేరకు ఉందో పరీక్షించారు. ఆశ్చర్యకరంగా వేళ్లనీ చీకే అలవాటు ఉన్న పిల్లల్లో అలెర్జీలను ఎదుర్కొనే శక్తి 31 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. పైగా పిల్లల్లో వేళ్లని చప్పరించడంతో పాటుగా, గోళ్లు కొరుక్కునే అలవాటు కూడా ఉంటే వారిలో ఈ నిరోధక శక్తి మరింత అధికంగా కనిపించింది.

కారణం !

మన వేళ్ల మీదా, గోళ్ల లోపలా రకరకాల సూక్ష్మక్రిములు నివాసం ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే చిన్నతనంలోనే వీటికి పిల్లలు అలవాటు పడటంతో, వారిలో సదరు క్రముల పట్ల నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు పరిశోధకులు. అయితే ఏఏ క్రిముల పట్ల ఇలాంటి నిరోధక శక్తి లభిస్తుందో ధృవపరిచే ప్రయత్నంలో ఉన్నారు. అలాగని పిల్లల్లో ఈ అలవాట్లు కనిపిస్తే చూసీ చూడకుండా ఊరుకోవడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక వయసు దాటిన పెద్ద పిల్లలు కనుక గోళ్లు కొరుక్కోవడమో, వేళ్లు చప్పరించుకోవడమో చేస్తుంటే తప్పకుండా వైద్యుని సంప్రదించమని చెబుతున్నారు. పెద్ద వయసులో ఇలాంటి అలవాట్లు ఉండటం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందనీ, కొన్ని మానసిక సమస్యలకు కూడా ప్రతిబింబంగా మారుతుందనీ తేల్చి చెబుతున్నారు. కాబట్టి పసి పిల్లల్లో కనుక వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే దానిని మాన్పించే ప్రయత్నం అయితే చేయవచ్చు కానీ.... మరీ బెంబేలెత్తిపోవల్సిన అవసరం మాత్రం లేదన్నమాట!

- నిర్జర.

 

 

By
en-us Political News

  
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.