కన్న బిడ్డ మృతదేహంతో స్కూటీపై 120 కిలోమీటర్లు.. అంబులెన్స్ సౌకర్యం కల్పించని కేజీహెచ్ అమానవీయం

Publish Date:Feb 16, 2023

Advertisement

జగన్ పాలనలో సర్వ వ్యవస్థలూ భ్రష్టు పట్టిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవత్వం అన్నది మచ్చుకైనా కనిపించని పరిస్ధితి నెలకొంది. అసలు జనగ్ పాలనలో జవాబుదారీ తనమై కరవైందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. జనం ప్రశ్నిస్తున్నా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆందోళనకు దిగినా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో తాజాగా జరిగిన ఒక అమానవీయ ఉదంతం గురించి తెలుగుదేశం జాతీయ కార్యదర్వి నారా లోకేష్ గురువారం ( ఫిబ్రవరి 16) చెప్పారు. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ఓ చిన్నారి మరణిస్తే.. ఆమె మృత దేహాన్ని అక్కడ నుంచి   స్వస్థలమైన పాడేరుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ అంబులెన్స్ ను ఏర్పాటు చేయడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాళ్లు పట్టుకుని అడిగినా కేజీహెచ్ సిబ్బంది కనికరించలేదనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, అవమానించారనీ ఆ పాప తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీ లేక విశాఖ నుంచి పాడేరుకు 120 కిలోమీటర్ల దూరం తన కన్న బిడ్డ మృతదేహాన్ని స్కూటీపై తీసుకువెళ్లారు. ఈ దయనీయ సంఘటన చూసిన వారందరికీ కంట నీరు తెప్పించింది.

ఈ సంఘననే లోకేష్ చెప్పారు. ఆ పాప తల్లిదండ్రుల దయనీయ స్థితి వింటున్న తనకు కన్నీరు వచ్చిందనీ, అందరి చేతా కంటనీరు పెట్టించిన ఉదంతం అధికారంలో ఉన్న పబ్జీ ప్లేయర్ జగన్ ను మాత్రం కదిలించలేకపోయిందని విమర్శించారు. రోమ్ నగరం తగలడిపోతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తే బెటర్ అన్నట్లుగా జగన్ తీరు ఉందని దుయ్యబట్టారు. పూటకో అమాన‌వీయ ఘ‌ట‌న‌, రోజుకో ద‌య‌నీయ దృశ్యం జగన్ పాలనలో నిత్యకృత్యంగా మారిపోయాయన్నారు. ఇక కేజీహెచ్ లో మరణించిన చిన్నారి విషయానికి వస్తే.. అనారోగ్యంతో ఆ పాప మరణించింది వాస్తవమే.

అయితే ఆ పాప అనారోగ్యం ఏమిటన్నది కూడా ఆసుపత్రి వర్గాలు కానీ, వైద్యులు కూడా చెప్పలేదు. ఆ పాప తల్లి దండ్రులు మాత్రం ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ రక్త నమూనాలు సేకరించారనీ, అయితే మా పాప అనారోగ్యం ఏమిటన్నది కానీ, రోజూ రక్త నమూనాలు ఎందుకు సేకరిస్తున్నారని కానీ తమకు మాటమాత్రం చెప్పలేదని ఆ పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.