దేశంలో ప్రతిపక్షాలు లేవన్న చిదంబరం.. అసలు కారణం ఇదే

Publish Date:Feb 1, 2022

Advertisement

కాంగ్రెస్ ప్రతి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబర ఒక సంచలన ప్రకటన చేశారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేవు అని తేల్చి పడేశారు.అయితే ఆయన ఆగ్రహానికి కారణం లేక పోలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న (సోమవారం) మొదలయ్యాయి. సమావేశాల తొలి రోజునే ప్రభుత్వం ఆర్థిక సర్వే 2022ను పార్లమెంట్‌కు సమర్పించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ‘ కు సమర్పించిన ఆర్థిక సర్వేలో ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. వ్యవసాయ రంగం వాటా అధికంగా ఉంటుందని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. మిగిలిన రంగాల ప్రాధాన్యతలో పెద్దగా మార్పులు ఉండబోవనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేకి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై చిదబరం ఆగ్రహం వ్యక్తం చేయడానికి, సంబంధ ఏమిటని, అనిపించవచ్చును. కానీ, వుంది. చిదంబరం తెల్లారు ఝామునే లేచి, ఆర్ధిక సర్వేపై ఏ పార్టీ ఎలా స్పందించిందో చూసేందుకు పేపర్లు తిరగేస్తే, ఎక్కడా విపక్షాల రీయాక్షన్ కనిపించనే  లేదు ఆ కారణంగా చిదంబరంకు కోప మొచ్చింది. ఆ కోపంలోనే ఆయన, ‘దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేవు’,  ఒకటి రెండు పార్టీలు ఉన్నా అవి  నోరు మెదపట్లేదని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ ఒకటి  రెండు పార్టీల్లో కాంగ్రెస్ ఉందా లేదా అనేది ఆయన స్పష్టం చేయలేదు. 
అదలా ఉంటే చిదంబరం, ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా, తమ అగ్రహానికి కారణం కూడా ఆయనే వివరించారు. ఆయనేమన్నారంటే ..తెల్లవారు జామున తాను దినపత్రికల్నీ చూశానని, ఎకనమిక్ సర్వే మీద ప్రతిపక్ష పార్టీలు స్పందించినట్లుగా ఎక్కడే గానీ తనకు వార్తలు కనిపించలేదని అన్నారు. దీన్ని బట్టి చూస్తోంటే దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయిందనేది స్పష్టమౌతోందని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌లో ఛార్లెస్ డికెన్స్ రాసిన ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ నవలను ఉటంకించారు. అత్యద్భుత సందర్భాలు, అత్యంత దారుణ పరిస్థితులను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలను సంధించారు. 2020 మార్చి 31వ తేదీ నాటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎకనమిక్ సర్వే చూసిన ప్రతీసారీ తనకు వికారం కలుగుతోందని వ్యాఖ్యానించారు. 2020 మార్చి 31వ తేదీన ఏ వృద్ధిరేటును టార్గెట్ చేశామో.. రెండు సంవత్సరాల తరువాత కూడా అదే వృద్ధి రేటును అందుకోవడానికి కష్టపడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.