చర్లపల్లి డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Publish Date:Sep 7, 2025

Advertisement

 

చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చే చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి కంపెనీపై రైడ్ చేసి 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి... కొన్ని కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కంపెనీ యజమాని శ్రీనివాస్ విజయ్ ఓలేటినీ పోలీసులు అరెస్టు చేసి అతని చరిత్ర పై ఆరాతీస్తున్నారు. ఎండి డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ ఓలేటి గతంలో జీవికే బయో సైన్స్ లో 12 సంవత్స రాల పాటు కెమికల్ అనాలసిస్‌గా పనిచేశాడు.

ఐదు సంవత్సరాల క్రితం జీవికే బయోసైన్స్ నుంచి బయటికి వచ్చిన విజయ్ ఓలేటి కెమికల్ తయారీ కంపెనీ తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడం లో విజయ్ ఓలేటి దిట్ట...మహారాష్ట్ర చెందిన తానాజీ తో కలిసి విజయ్ వాగ్దేవి ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి... చర్లపల్లి లో డ్రగ్స్ రా మెటీరియల్ తయారు చేసి నాచారంలో డ్రగ్స్ తయారు చేసేవాడు..తానాజీ తో కలిసి విజయ్ ఐదేళ్లుగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తు న్నాడు. అయితే విజయ్ అతి కొద్ది మంది సిబ్బంది తో మాత్రమే కంపెనీని నడపించడమే కాకుండా అది కూడా కేవలం రాత్రిపూట మాత్రమే నడిపేవారు.


 ఆ విధంగా తయారు చేసిన సింథటిక్ డ్రగ్స్ ను పోలీసుల కంట పడకుండా వివిధ మార్గాల ద్వారా మన దేశం తో పాటు విదేశా లకు సరఫరా చేసేవాడు. విజయ్  ముందుగా అత్యంత ప్రమాదక రమైన మెఫీడిన్  డ్రగ్ తయారు చేశాడు. అనంతరం మెఫీడిన్  డ్రగ్ నుంచి ఎక్సెసి, మోలీ ,xtc, MDMA  మొదలగు నాలుగు రకాల డ్రగ్స్ లను తయారు చేసి ముంబై, గోవా, బెంగళూరులకు రహస్యం గా వివిధ వస్తువుల మాటున తరలించేవారు. అయితే ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని దేశ విదేశా లకు సరఫరా చేసేందుకు విజయ్ ఒక గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 

అంతేకాకుండా డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ కి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా పోలీ సులు గుర్తించారు. ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని విజయ్ మొదటగా హైదరా బాదులో అమ్మి అనంతరం విదేశాలకు సరఫరా చేసేవాడు. ప్రతిసారి ఐదు కేజీల చొప్పున మెపిడ్రిన్ అమ్మే వాడు. ఒక్కొక్క కేజీ 50 లక్షల రూపా యల చొప్పున అమ్మేవాడు. ఈ విధంగా నాచారం, చర్లపల్లిలో డ్రగ్స్ తయారుచేసి దర్జాగా విక్ర యాలు చేసేవాడు. ప్రతిసారి డ్రగ్స్ కు 50 లక్షల తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి డ్రగ్స్ కంపెనీ పై సోదాలు చేసి... కంపెనీ యజమాని విజయ్ ఓలేటి, తానాజీ లతో పాటు మరో 10 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 

అయితే గతంలో డ్రగ్స్ తయారు చేస్తు న్నట్లుగా గుర్తించిన తెలంగాణ నార్కో టిక్ బృందం డ్రగ్స్ తయారీపై విజయ్ కి నోటీ సులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విష యంపై విజయ్ కోర్టు ను ఆశ్రయించారు. అయితే బంగ్లాదేశ్ కి చెందిన ఓ మహిళ పట్టుబ డడంతో హైదరా బాద్ చర్లపల్లి లో డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. చర్ల పల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో రూ.11. 58 కోట్లు విలువైన మెఫిడ్రిన్ తయారీ చేస్తున్నారు. 35,500 లీటర్లు రసాయ నాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాదీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ అరెస్ట్ చేసి...ఇద్దరిని నిందితులను ట్రాన్సిట్ వారెంట్ తో ముంబై కి తరలించారు.

By
en-us Political News

  
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.