Publish Date:Sep 16, 2024
కొంతమంది మోసపోవడానికే పుడతారు. పెద్దగా చదువుకోనివారి కంటే, బాగా చదువుకుంటున్నాం... బోలెడంత సంపాదిస్తున్నాం... మోడ్రన్‌గా జీవిస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చేవారే గోతిలో పడుతున్నారు. ఎంత వెర్రిబాగులవాడు అయినా ఆ రకంగా మోసపోరు గానీ.. బాగా చదువుకున్నవారు, సాఫ్ట్.వేర్ ఇంజనీర్లం అంటూ పోజులు కొట్టేవారు వాళ్ళు మాత్రం చాలా సిల్లీగా మోసపోతున్నారు. ఇలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. లేటెస్ట్.గా ఒక సాఫ్ట్.వేర్ ఇంజనీర్ చాలా సాఫ్ట్.గా మోసపోయాడు. అది కూడా సైబర్ మోసం. సంప్రదాయినీ... సుద్దపూసనీ అయిన సదరు సాఫ్ట్.వేర్ ఇంజనీర్ ఎలా మోసపోయాడో తెలుసుకుందాం.
తిరుపతిలో సాఫ్ట్.వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడికి ఈనెల ఐదో తారీఖునాడు కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేశారు. తమను తాము సైబర్ క్రైమ్ పోలీసులుగా చెప్పుకున్నారు. నువ్వు ఇరాన్‌కి అక్రమంగా వస్తువులు సరఫరా చేశావ్.. ఠాఠ్.. ఠూఠ్.. అన్నారు. ఈ కేసు మీద విచారణ జరపడానికి నువ్వు వెంటనే ముంబై రావాలని చెప్పారు. సర్లేగానీ, నీ బ్యాంక్ ఖాతా వివరాలు, నీ ఫోన్‌కి వచ్చే ఓటీపీ ఇవ్వు అన్నారు. దాంతో ఈ సాఫ్ట్.వేర్ బుద్ధావతారం వాళ్ళు చెప్పినట్టే అన్ని వివరాలూ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ సాఫ్ట్.వేర్ సార్‌కి ఓ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు మా బ్యాంక్ నుంచి 13 లక్షల 80 వేల రుణం తీసుకున్నావనేది ఆ ఫోన్ సారాంశం. దాంతో షాకైపోయిన ఆ సాఫ్ట్.వేర్ సుద్దపూస చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఏం చేస్తారు? కేసు పెడతారు. ఈయన గారు తెలివితక్కువగా మోసపోతే, పోలీసులు తంటాలుపడి ఈయన గారిని రక్షించేసేయాలి. అంతేగా? చదువుకుంటే సరిపోదు...!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cheating-to-software-engineer-25-184891.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.