టీచర్ల మెడపై ఛార్జ్ మెమోల కత్తి.. ఎన్నికల విధుల నుండి తప్పించేందుకేనా?

Publish Date:Nov 24, 2023

Advertisement

రానున్న ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైపోయిందని  రాజకీయ వర్గాలు, సర్వేలూ బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.  వైసీపీ ఓటమి తథ్యమన్న విషయం ఏపీలో ప్రజలకే కాదు.. వైసీపీ నేతలకు, పెద్దలకు కూడా అర్దమైపోయింది. సర్వేల ఫలితాలు, వైసీపీ అంతర్గత సర్వేలు, రహస్యంగా తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ సర్వే, ప్రజలలో కనిపిస్తున్న అసంతృప్తితో తన ఓటమిని నిర్ధారించుకున్న వైపీసీ పెద్దలు ఇప్పుడు మాయ చేసి, కుట్రలు పన్నైనా గెలవాలని చూస్తోంది. అందుకోసం అవకాశాలను వెతుక్కుంటోంది. ఏపీలో పెద్ద ఎత్తున దోంగ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు అంశంలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని  తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. దొంగ నోట్ల నమోదు, అసలు ఓట్ల నమోదు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏపీలో ఇద్దరు అధికారులను  సస్పెండ్  కూడా  చేసింది. అదలా ఉండగా, ఏపీలో అధికార వైసీపీ మరో కుట్రకు తెరలేపింది.  అదే ఎన్నికల విధులలో తమకు అనుకూలంగా ఉండే   అధికారుల నియామకం.

నిజానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీచర్లే కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్న సంగతి విదితమే.   అయితే ఈసారి ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని వైసీపీ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ జీవోను కూడా తీసుకొచ్చింది. 2022 నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు సవరణలు చేసి.. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదని జీవో తెచ్చింది. అలాగే ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఉద్యోగుల వివరాలను చెప్పాలని ఈసీ కోరగా.. వైసీపీ ప్రభుత్వం టీచర్ల మినహా.. ఇతర రంగాల ఉద్యోగులు, తాను నియమించుకున్న సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునేలా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈసీ మరోసారి ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది. ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.  

దీంతో వైసీపీ సర్కార్ టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించేలా మరో కుట్రకి తెరతీసినట్లు కనిపిస్తున్నది. ఇందుకోసం ఏకంగా టీచర్లను బలి చేసేలా ఛార్జ్ మెమోలను జారీ చేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంద మందికిపైగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వంద మందికిపైగా ఈ మెమోలు అందజేసినట్లు తెలుస్తుండగా.. నేడో రేపో నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున టీచర్లకు ఛార్జ్ మెమోలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలలో ఉంటూ ప్రభుత్వంపై నిరసన గళాన్ని వినిపిస్తున్న టీచర్లను ఏరి కోరి కుంటి సాకులతో వారికి ఛార్జ్ మెమోలు జారీచేస్తున్నట్లు తెలుస్తున్నది. లెసన్ ప్లాన్ సరిగా లేదని,  బైజూస్ కంటెంట్ సరిగా అప్ లోడ్ చేయడం లేదని, నోట్ బుక్స్ సరిగా కరెక్షన్ చేయడం లేదని ఇలా వివిధ కారణాలను చూపుతూ మెమోలు జారీ చేస్తున్నారు. కనీసం షోకాజ్ నోటీలు కూడా ఇవ్వకుండానే ఏకంగా ఛార్జ్ మెమోలు జారీ చేస్తూ మేజర్ పనిస్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ మెమోలు జారీ అయితే వాళ్లపై నెగటివ్ మార్క్ పడుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ మెమో జారీ అయితే పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు సిద్దమవుతున్న జాబితాలో వారికి చోటు దక్కదు. ఇందు కోసమే ప్రభుత్వం ఇలా అడ్డదారిన మెమోలు జారీచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రెండు ఉమ్మడి జిల్లాలలో టీచర్లకు మెమోలు ఇవ్వగా.. ఇప్పుడు మరో జిల్లా ఉపాధ్యాయులకు కూడా మెమోలు సిద్ధమవుతున్నాయి. ఇక త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ టీచర్లకు ఛార్జ్ మెమోలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే టీచర్లకు మాత్రమే ఎన్నికల విధులు అప్పగించేలా  కుట్రపూరితంగా ప్రభుత్వం చార్జి మెమోలు దాఖలు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న వారు, అసంతృప్తితో ఉన్న వారిని  ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టేందుకు కుట్ర పన్నినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే  ఈ మెమోలకు వ్యతిరేకంగా  నిరసనలకు ఉద్యమిస్తామని, ఎన్నికల విధులకు వెళ్లకుండా అసలు ఎలా ఆపుతారో చూస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు సవాల్ విసురుతున్నారు.   ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో నన్న ఆసక్తి ఏపీ వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.