శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు

Publish Date:May 29, 2026

Advertisement

 

భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచడం జరిగింది.

అదేవిధంగా మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీ‌వాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించడం జరిగింది.

ఈ సదుపాయం 2025 మే 1 నుండి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేయబడతాయి. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించబడుతుంది. కాగా ఈ విధానం జూన్ 10వ తేది నుండి అమలులోకి రానుంది. ఈ కోటాలో బుకింగ్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపబడతాయి. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి.
హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని షేర్ లింగంపల్లి పోలీసులు ఛేదించారు.
ఉన్నత చదువులు, కుటుంబ ఆశయాలు, భవిష్యత్తుపై ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి హీటెక్కింది.
ఉత్తరాఖండ్‌లో ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు ముందుకు వేసింది.
వేసవి సెలవులను ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని ఆ కుటుంబాలు ఎన్నో కలలు కన్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ పరామర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.