విజయసాయిలో మార్పు.. పరివర్తనేనా?.. రఘురామకృష్ణం రాజు అనుమానం

Publish Date:Feb 20, 2023

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతను గమనించిన తరువాత ఆయనలో మార్పు వస్తోందని, ఇది మంచి పరిణామమేనని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో విజయసాయి చేస్తున్న ట్వీట్లు చూస్తే ఆయనలో వస్తున్న మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అందుకు కారణమైన అధికార వైసీపీ తీరు.. ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకత చూస్తే ఎవరిలోనైనా మార్పు రాక తప్పదని అన్నారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్టులు తథ్యమని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించుకోవడం ఏ విధంగా చూసినా పెద్ద పరిణామమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.  

నందమూరి తారకరత్న చిన్న వయస్సులోనే మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, ఆయన మరణంపై కొందరు వైసీపీ నేతలు, లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయన్నారు. వైసీపీ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమనీ, వారు చావులో రాజకీయ లబ్ధి వెతుక్కుంటున్నారని విమర్శించారు.  ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను స్వార్థ రాజకీయాల కోసం ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీ పార్వతి వంటి మారి మాటలు, వ్యాఖ్యలను  విజయసాయి తన మాటలు, చేతల ద్వారా తప్పని చాటారు. రఘురామరాజు అన్నారు. నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.  

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.