యాక్సిడెంట్..!

Publish Date:Nov 11, 2023

Advertisement

యాక్సిడెంట్.. అంతా యాక్సిడెంటే.. చంద్రమోహన్ బావ ఎవరికో సినిమా అవకాశం కోసం ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి వద్దకు వెళ్లితే.. నాకు ఇలాంటి లక్షణాలు, ఇలాంటి ఆహర్యం ఉన్న అబ్బాయి కావాలంటే.. అయితే మా బావమరిది ఉన్నాడు.. మీరు చెప్పిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయంటూ చంద్రమోహన్‌ను ఆ ప్రముఖ దర్శకుడికి పరిచయం చేశారు. అలా రంగులరట్నం చిత్రంతో చంద్రమోహన్ తెరంగేట్రం చేశారు. అంత పొడుగు కాదు.. అలాగని అంత మధ్యస్థం ఎత్తు కూడా లేడు. పొట్టిగా ఉన్నాడు. పోని రంగు, రూపు చూస్తే అవి కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వెండి తెర మీద హీరోగా వెలిగిపోయే లక్షణాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయనలో మచ్చుకు లేదు.  

అలాంటి చంద్రమోహన్.. కేవలం తనలోని ప్రతిభను మాత్రమే నమ్ముకొని.. 55 ఏళ్ల తన సినిమా కెరీర్‌లో.. 900కు పైగా చిత్రాల్లో నటించారు. అయితే 175 సినిమాల్లో ఆయన హీరోగా నటించి.. తన నటనతో ప్రేక్షకుల మనస్సును కత్తిరించి  చోరీ చేసిపారేశారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. ఐఎన్ మూర్తి దర్శకత్వంలో వచ్చిన సుఖదు:ఖాలు చిత్రంలో తన సోదరి వాణిశ్రీని ప్రేమించి, వంచించిన వ్యక్తిని హత్య చేసి.. ఆ తర్వాత.... అతడి ఇంట్లోనే దాక్కోవడం.. అలాగే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన బంగారు పిచుకలో తల్లి చాటు కొడుకుగా ఉన్న చంద్రమోహన్‌ను కన్న తండ్రి బయట ప్రపంచం చూడరా బాబు అంటూ ఇంటి నుంచి పంపిచేయడం.. ఇక కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడదలైన సిరిసిరిమువ్వ చిత్రంలో సాంబయ్యగా.. సవతి తల్లి చేతిలో అవమానాలకు గురవుతున్న మూగ అమ్మాయి జయప్రద.. మోసగాడితో పెళ్లి అవుతుంటే.. ఆ పెళ్లిని ఆపేందుకు.. రా దిగి రా.. దివి నుంచి భువికి దిగా రా.. అంటూ డప్పు కొడుతూ ఊగిపోతు పాడడం.. అదే విశ్వనాథ్ దర్శకత్వంలో నటించి మరో చిత్రం సితామహాలక్ష్మీ. ఈ చిత్రంలో సీతాలు సింగారం.. మాలచ్చిమి బంగారు.. బంగారు కొండయ్య అంటే భగవంతుడవతారం అంటూ తాళ్లురి రామేశ్వరితో చంద్రమోహనుడి చట్టాపట్టాలు.. మళ్లీ ఆదే విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన చిత్రం శంకరాభరణం. ఈ చిత్రంలో కామేశ్వరరావుగా అన్నవరంలో దేవుడి మెట్ల మీద... మర చెంబు, గ్లాసు, రాజ్యలక్ష్మీతో చూపులు కలిసిన శుభవేళ.. సీన్లు ఎలా ఉంటాయంటే... అన్నవరం సత్యదేవుని ప్రసాదంలా.. రుచిగా, శుచిగా మనస్సును అట్టే కట్టి పడేస్తాయి.  

ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కిన పదహరేళ్ల వయస్సు చిత్రంలో.. అమాయక దివ్యాంగుడి పాత్రలో చంద్రమోహన్ ఒదిగిపోయి నటిస్తే.. అప్పటికి జగదేక సుందరి పేరు సంపాదించుకోని శ్రీదేవితో కలిసి నటించిడం.. మరో విశేషం. బీరం మస్తాన్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం సువర్ణసుందరి. ఈ చిత్రంలో భార్యనే ప్రేయసి భావించి.. ఆమెనే ఆరాధిస్తూ.. కవిత్వాన్ని రాసే భర్తగా చంద్రమోహన్ నటన నభూతో న భవిష్యత్.    

అలాగే ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో చెక్కిన శిల్పం రాధాకల్యాణం. ఈ చిత్రంలో అరవ అబ్బాయి పాల్ఘాటి మాధవన్‌గా చంద్రమోహన్.. అతడిని ప్రేమించే అమ్మాయిగా రాధిక నటన.. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం, పాటలు అన్ని ముగ్ద మనోహర గీతంలా ఉంటాయి. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లుడు గారు. ఇందులో లాయర్ పాత్రలో నటించిన చంద్రమోహన్‌ను పిప్పళ్ల బస్తా అంటూ మోహన్ బాబు ఆట పట్టించడం.. ఆ క్రమంలో చంద్రమోహన్ ప్రతిస్పందించే సన్నివేశాలు.. సరదా సరదాగా ఉంటాయి. 

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369లో వికట కవి తెనాలి రామకృష్ణగా ఆయన నటన ఆమోఘం. అలాగే కలికాలం, ఆమె, మన్మధుడు, 7/జీ బృందావన్ కాలనీ, వర్షం, గులాబీ, అతనొక్కడే.. ఇలా చెప్పుకొంటు పొతే చంద్రమోహన్ నటించిన ప్రతీ చిత్రం సినీ వినీలాకాశంలో చంద్రహాసమే. అదే విధంగా అయన పక్కన నటించిన ప్రతీ హీరోయిన్ ఆ వినీనాకాశంలో స్టార్ కాదు.. సూపర్ స్టార్ కాదు.. సూపర్ డూపర్ లేడి స్టార్స్‌గా ఎదిగి.. పేరు ప్రఖ్యాతి గాంచారు. అందుకు శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధిక, రాజ్యలక్ష్మీ, ముంజల, తాళ్లూరి రామేశ్వరి భానుప్రియ, శాంతిప్రియ ఇలా జాబితా చాలా పెద్దదే. 

  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రమోహన్  శనివారం (నవంబర్ 11)కన్నుమూశారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1942, మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం పమిడిముక్కల్లో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు ఆయన జన్మించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల నుంచి ఏజీ బీఎస్సీ పట్టా అందుకొని.. కొనాళ్లు ప్రభుత్వ కొలువులో పని చేసి.. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే చంద్రమోహన్ మరణించినా.. ఆయన నటించిన చిత్రాలు మాత్రం.. వెండి తెర మీద ధృవ నక్షత్రంలా వెలుగుతూనే ఉంటాయన్నది మాత్రం టాలీవుడ్ ఉవాచ.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.