చంద్రబాబు జమానా.. అభివృద్ధి నమూనా.. పాలకుడంటే బాబే..
Publish Date:Apr 20, 2022
Advertisement
నారా చంద్రబాబు నాయుడు.. పరిచయం అక్కర్లేని పేరు.. దార్శనికతకు మరో పేరు. వయస్సు 72ఏళ్లు అయితేనేం.. 27ఏళ్ల నవయవ్వనులను మించిన ఉత్సాహం. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేద్దామన్న తపన.. వెరసి సమ్మతీయులు, అసమ్మతీయులూ కూడా ఆయనకు పెట్టిన పేరు పని రాక్షసుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పథకాలు, అభివృద్ధి పనులసమీక్ష సందర్భంగా ఆయన తరచుగా అధికారులతో‘నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనీయను’ అంటుండేవారు. విపక్షంలో ఉన్నా, ఆయనది అదే తీరు.. రోజుకు 18 గంటల పాటు పని, పని, పని. ఆయన నిరంతర సాధన, నిత్య శ్రమే చంద్ర బాబును ఓటమి, గెలుపులకు అతీతంగా సర్వామోద నాయకుడిగా మార్చేసింది. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతగా శ్రమించారో...విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడటంలోనూ అంతే క్రియాశీలంగా వ్యవహరిస్తారు. రాజకీయ నేతగా పార్టీని అధికారంలోనికి తీసుకురావడానికి ఎంతగా శ్రమిస్తారో...అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా శ్రేయస్సు, సంక్షేమానికి అంతగా తపిస్తారు. సమకాలీన రాజకీయాలలో చంద్రబాబునాయుడి వంటి సుదీర్ఘ అనుభవం ఉన్ననేత మరొకరు లేరనడంలో అతిశయోక్తి లేదు. అధికారమే పరమావధి అనుకుని ఉంటే చంద్రబాబు అపజయమెరుగని నేతగానే కొనసాగి ఉండేవారు. కానీ సుదీర్ఘ భవిష్యత్.. భావి తరాల సంక్షేమం యోచంచి....రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కఠిన నిర్ణయాలకు వెరవని సహసి చంద్రబాబు. సమకాలీన రాజకీయాలలో మిగిలిన నేతలతో పోలీస్తే చంద్రబాబును ప్రత్యేకంగా నిలబెట్టేది.... ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వమే. రాజకీయాలలో చంద్రబాబు ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులను ఎదుర్కొన్ననేత మరోకరుండరంటే అతిశయోక్తి కాదు. ఘన విజయాలు, ఘోర పరాజయాలు...అయితే విజయాలకు పొంగిపోలేదు...పరాజయాలకు కుంగిపోలేదు. అరహారంపార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలుగా ముందుకుసాగుతూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాటు ఆయన పాలన రాష్ట్రాన్ని అగ్రపీఠిన నిలిపింది. అనితర సాధ్యమనేలా అభివృద్ధి పథాన నడిచింది. ఆయన విద్యా రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలే నేటికీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలలో అద్భుతంగా రాణించేందుకు దోహదపడుతున్నది. ఐటీ కొలువుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నిపుణులో మిగిలిన రాష్ట్రాల వారి కంటే ముందు పీటన నిలవ గలుగుతున్నారంటే అందుకు రాష్ట్రంలో సాంకేతిక విద్యా రంగంలో అపార అవకాశాలు పేరిగే విధంగా నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చర్యలే కారణం. మానవ వనరుల అభివృద్ధి కోసం ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాలను అమలు చేశారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రబాబునాయుడే. హైదరాబద్ ను వీశ్వనగరంలా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు పరిచింది చంద్రబాబేనని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారంటే హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర, పాత్ర ఏమిటో తెలుస్తుంది.
http://www.teluguone.com/news/content/chandrababu-tenure-sign-of-developement-39-134649.html





