చంద్రబాబు జమానా.. అభివృద్ధి నమూనా.. పాలకుడంటే బాబే..

Publish Date:Apr 20, 2022

Advertisement

నారా చంద్రబాబు నాయుడు.. పరిచయం అక్కర్లేని పేరు.. దార్శనికతకు  మరో పేరు. వయస్సు 72ఏళ్లు అయితేనేం.. 27ఏళ్ల నవయవ్వనులను మించిన ఉత్సాహం. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేద్దామన్న తపన.. వెరసి సమ్మతీయులు, అసమ్మతీయులూ కూడా ఆయనకు పెట్టిన పేరు పని రాక్షసుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పథకాలు, అభివృద్ధి పనులసమీక్ష సందర్భంగా ఆయన తరచుగా అధికారులతో‘నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనీయను’ అంటుండేవారు. విపక్షంలో ఉన్నా, ఆయనది అదే తీరు.. రోజుకు 18  గంటల పాటు పని, పని, పని. ఆయన నిరంతర సాధన, నిత్య శ్రమే చంద్ర బాబును ఓటమి, గెలుపులకు అతీతంగా సర్వామోద నాయకుడిగా మార్చేసింది. 

అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతగా శ్రమించారో...విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడటంలోనూ అంతే క్రియాశీలంగా వ్యవహరిస్తారు. రాజకీయ నేతగా పార్టీని అధికారంలోనికి తీసుకురావడానికి ఎంతగా శ్రమిస్తారో...అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా శ్రేయస్సు, సంక్షేమానికి అంతగా తపిస్తారు. సమకాలీన రాజకీయాలలో చంద్రబాబునాయుడి వంటి సుదీర్ఘ అనుభవం ఉన్ననేత మరొకరు లేరనడంలో అతిశయోక్తి లేదు.  

అధికారమే పరమావధి అనుకుని ఉంటే చంద్రబాబు అపజయమెరుగని నేతగానే కొనసాగి ఉండేవారు. కానీ సుదీర్ఘ భవిష్యత్.. భావి తరాల సంక్షేమం యోచంచి....రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కఠిన నిర్ణయాలకు వెరవని సహసి చంద్రబాబు. సమకాలీన రాజకీయాలలో  మిగిలిన నేతలతో పోలీస్తే చంద్రబాబును ప్రత్యేకంగా నిలబెట్టేది.... ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వమే. 

రాజకీయాలలో చంద్రబాబు ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులను ఎదుర్కొన్ననేత మరోకరుండరంటే అతిశయోక్తి కాదు. ఘన విజయాలు, ఘోర పరాజయాలు...అయితే విజయాలకు పొంగిపోలేదు...పరాజయాలకు కుంగిపోలేదు. అరహారంపార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలుగా ముందుకుసాగుతూనే ఉన్నారు. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  తొమ్మిదేళ్ల పాటు ఆయన పాలన రాష్ట్రాన్ని అగ్రపీఠిన నిలిపింది. అనితర సాధ్యమనేలా అభివృద్ధి పథాన నడిచింది. ఆయన విద్యా రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలే నేటికీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలలో అద్భుతంగా రాణించేందుకు దోహదపడుతున్నది. ఐటీ కొలువుల్లో  తెలుగు రాష్ట్రాలకు చెందిన నిపుణులో మిగిలిన రాష్ట్రాల వారి కంటే ముందు పీటన నిలవ గలుగుతున్నారంటే అందుకు రాష్ట్రంలో సాంకేతిక విద్యా రంగంలో అపార అవకాశాలు పేరిగే విధంగా నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చర్యలే కారణం. మానవ వనరుల అభివృద్ధి కోసం ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాలను అమలు చేశారు. 

ఇక హైదరాబాద్ అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రబాబునాయుడే.  హైదరాబద్ ను వీశ్వనగరంలా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు పరిచింది చంద్రబాబేనని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారంటే హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర, పాత్ర ఏమిటో తెలుస్తుంది. 

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.