ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేరుగా వైసీపీ పేరు ప్రస్తావించకుండానే కుట్ర రాజకీయాలు చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశంపై వైసీపీ ఆరోపణలను ఖండించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు తమ ప్రభుత్వ హయాంలోనే సిద్ధమయ్యాయని.. కానీ ఆ క్రెడిట్‌ను దక్కించుకోవడానికి వైసీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందన్నారు. మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇతర ప్రాంతాల మత్స్యకారులు ఏపీ జలాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన పేదల సేవలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా పెన్షన్లు అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన హామీ మేరకు 'తల్లికి వందనం, దీపం 2.0' వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇంటింటికీ పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-slams-ycp-false-propaganda-25-216525.html
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.