తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరే విషయంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరౌతున్నాయనీ, తెలుగుదేవం ఎన్డీయే గూటికి చేరనుందని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. దానికి తాను కాదు.. అలా ప్రచారం చేసిన వారే బదులివ్వాలన్నారు. ఈ విషయంపై తాను ఇప్పుడు స్పందించబోనని చంద్రబాబు పేర్కొన్నారు. నాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ నష్టపోయిన దాని కన్నా ఇప్పుడు జగన్ పాలనలోనే ఎక్కువ నష్టపోయిందని ఆయన అన్నారు. తానేం చేసినా, ఎ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. తాను కేంద్ర రాజకీయాలను కూడా ఈ కోణంలోనే చూస్తామని చంద్రబాబు అన్నారు. తాను పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందని... రాష్ట్రానికి మంచిపేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా కూడా నష్టపోయామని అన్నారు. సంక్షేమ పథకాలపై టీడీపీ ఎంతో దృష్టిపెట్టిందని... మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోడానికి తెలుగుదేశంతో చెలిమికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో చేరడంపై చంద్రబాబు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.
మొత్తంగా ఎన్డీయేలో చేరిక వార్తలను చంద్రబాబు పూర్తిగా ఖండించలేదు.. అలాగని సమర్ధించనూ లేదు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో గత మూడేళ్లుగా జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరిందని చంద్రబాబు అన్నారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పునరుద్ఘటించారు.
అందు కోసం ఏమైనా చేస్తామన్నారు. తన సొంత నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ జగన్, ఆయన పార్టీ ప్రచారం చేస్తున్నాయన్నారు.
అసలు సంక్షేమం మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అనీ, అటువంటిది తాను సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు నిలిపివేస్తానని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి తనకు రెండు కళ్లు అని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-says-wount-respond-on-questions-about-joining-nda-39-143064.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.