ముందు నువ్వు జాగ్రత్త చంద్రబాబు బాబాయ్!

Publish Date:Sep 5, 2024

Advertisement

చంద్రబాబు బాబాయ్.. ఏంటి నువ్వు? ఎప్పుడూ జనాల గురించి ఆలోచించడమే గానీ, నీ ఆరోగ్యం గురించి పట్టించుకోవా? ఐదు రోజుల నుంచి వరద నీళ్ళలోనే, జనం మధ్యలోనే... ఇంటికి కూడా వెళ్ళకుండా తిరుగుతున్నావ్.  నీ ఆలోచన ఎప్పుడూ జనం క్షేమం గురించే వుంటుందిలే గానీ, కాస్త నీ గురించి కూడా కాస్త పట్టించుకోవయ్యా బాబూ! ఏంటీ, నువ్వేమన్నా బాలాకుమారుడివి అనుకుంటున్నావా? నీకు అర్థమవుతోందో లేదోగానీ, నువ్వు డైమండ్ జూబిలీకి వచ్చేశావు బాబాయ్! గతంలో కూడా ఇలాగే పనిచేశాను.. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తానంటే ఎలాగయ్యా?  అప్పట్లో అంటే నీ వయసు 57.. ఇప్పుడేమో 75. నీ వయసునైనా గౌరవించి కాస్త ఈ రకమైన హార్డ్ వర్క్ తగ్గించు బాబాయ్!  నువ్విప్పుడు చిన్న పిల్లాడితో సమానం. 

నిన్ననో, మొన్నో ఓ వీడియోలో చూశా.. నువ్వేంటీ? నీ వయసేంటీ? పాతిక కిలోల బస్తాని లేపి అవతల పెట్టేశావు. నీ వయసుకి ఇలాంటి పనులు చేయడం కరెక్టా చెప్పు? పాతిక కిలోల బస్తాని లేపాలంటే పాతికేళ్ళ వయసున్న కుర్రాళ్ళు కూడా వామ్మో అంటారు.. నువ్వేంటయ్యాబాబు.. చిటుక్కుమని లేపేశావ్.. లటుక్కుమని పక్కన పెట్టేశావ్. అయినా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నీకేంటి బాబాయ్? అసలు నీకు చెప్పడం మా వల్ల కాదు స్వామీ... ఈ వయసులో నిన్ను అపురూపంగా చూసుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వేమో సీతయ్యకి తాతయ్యలాగా తయారయ్యావ్. ఎవరి మాటా వినడు చంద్రయ్య అన్నట్టుగా ఇలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నావ్. అవునుగానీ, ఈరోజు నువ్వు బుడమేరుకి గండి పడిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫంటు ఎక్కావు. అప్పుడు లైఫ్ జాకెట్ వేసుకోవాలని తెలియదా? దానికితోడు కాలు స్లిప్పయితే వాగులో పడిపోయేలా వున్న ఆ రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళడమేంటి? కరెక్ట్.గా అప్పుడే రైలు రావడమేంటి? సమయానికి చూసుకోకపోతే ఏమైపోయేది? యో.. చూసుకోబళ్ళా? నీ పక్క నుంచి రైలు దూసుకువెళ్తున్న వీడియో చూసి మాకు గుండెలు గుబగుబలాడాయి.  ఫిలమెంటు రాలిపోయినంత పనైంది. రైలు పక్కన వున్న నువ్వు మాత్రం.. నాకిలాంటివి మామూలే అని సంతూర్ మామ్ లాగా ఎక్స్.ప్రెషన్ ఇచ్చి నిల్చున్నావ్. అంతేలే, అలిపిరిలో క్లైమోర్  మైన్స్ పేల్చినా చాలా లైట్‌గా తీసుకున్న మొండిఘటానివి నువ్వు. అయినా గండి పడిన చోట సిట్యుయేషన్ ఎలా వుందో అధికారులు చెబుతారు కదా... నువ్వెందుకు లింగులింగుమంటూ వెళ్ళావ్? నేను వెళ్ళాల్సిందే.. నేను చూడాల్సిందే అంటావ్.. ఇలాంటప్పుడే నిన్ను చూస్తే కోపం వస్తుంది. ముందు నువ్వు సేఫ్‌గా వుండాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు! ఇదిగో బాబాయ్.. నువ్వు మర్యాదగా మేం చెప్పినట్టు వింటావా? లేక భువనమ్మకి చెప్పి నిన్ను కంట్రోల్ చేయించాలా? ఏదో మా పిచ్చిగానీ, నువ్వు ఆమె మాట కూడా వినేరకం కాదు.

చూడు చంద్రబాబు బాబాయ్... నీ జీవితం నువ్వు ఎప్పుడో జీవించేశావ్.. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నది నీ జీవితం కాదు.. మా జీవితం! నీ జీవితం ఇప్పుడు మా జీవితం కాబట్టి, నువ్వు నీ ఇష్టమొచ్చినట్టు వుంటానంటే మేం ఒప్పుకోం. మన రాష్ట్రం విభజనతో సగం నాశనం అయింది. ఆ దరిద్రుడు జగన్ మిగతా సగాన్ని కూడా నాశనం చేసి సర్వనాశనం చేసిపారేశాడు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని కాపాడేది నువ్వు తప్ప మరెవరూ కాదు.. మాకు నువ్వు తప్ప మరో దిక్కు లేదు. అందువల్ల నువ్వు నీకోసం కాకపోయినా... మాకోసమైనా రిస్కులు చేయకయ్యా మహానుభావా! నువ్వు ఈ రాష్ట్రాన్ని దారిలో పెట్టాలి. ఆ నీచ, నికృష్టుడైన జగన్ బారి నుంచి మమ్మల్ని కాపాడాలి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం కావాలి.. ఇదంతా చేయడానికి... ఇదంతా చూడటానికి.. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి. నీకు దణ్ణం పెడతాం నాయనా.. నీ వయసుకు మించిన సాహసాలు చేయకు.. మాకు టెన్షన్ తెప్పించకు. ఎందుకంటే, నువ్వు మాకు అపూర్వం.. నువ్వు మాకు అపురూపం.. అంతే!

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.