వైసీపీపై సీఎం చంద్ర నిప్పులు.. : లోకేష్ రాజీనామా డిమాండ్‌పై వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్. !

Publish Date:Aug 10, 2026

Advertisement

రాష్ట్రంలోని రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం   పాల్గొని వైసీపీ వైఖరిపైవిమర్శలు గుప్పించారు. నెలనెలా స్వయంగా ప్రజల వద్దకు వచ్చి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్న చంద్రబాబు జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. గతంలో నేతల ఫోటోలతో పాసు పుస్తకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని, తమ ప్రభుత్వంలో నిజమైన యజమానులకే పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు.

ఆక్వా రంగానికి ఊరటనిస్తూ, పది ఎకరాల పరిమితి, జోన్ నాన్ జోన్ నిబంధనలను ఎత్తివేసి 1.50 కేనామలకే విద్యుత్ సరఫరా చేసే ప్రకటనపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై ప్రతిఏటా రూ.1,150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కైకలూరుకు  36 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ చేస్తున్న  డిమాండ్ ను  ఖండించారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూసిన మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తే..  కోర్టు కేసులతో అడ్డుపడాలని చూశారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసేలా ప్రవర్తించిన వారే ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

 గత పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, గంజాయి సంస్కృతి, రౌడీయిజం రాజ్యమేలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నా  అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.   ప్రజా సంక్షేమానికి అడ్డుపడే ఏ శక్తినైనా తిప్పికొట్టి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. 

Chandrababu Naidu Speeches, AP CM Kalidindi Visit, AP Land Pattadar Passbooks, Aqua Farmers Subsidy, Mega DSC Andhra Pradesh, TeluguOne

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.