బాబు..బహు జాగు బాసూ!

Publish Date:Oct 2, 2020

Advertisement

అధినేత సాగతీతే అసలు సమస్య

 

తెలంగాణలో మాయమవుతున్న తెలుగుదేశం

 

రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు

 

తొలగించకపోతే ఆఫీసులో ధర్నాకు సిద్ధం
                

తెలంగాణ లో పుట్టిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా మాయం కానుందా? అగ్రనేతలు నిష్క్రమించగా.. మిగిలిన నాయకులు, కార్యకర్తలను కూడా కాపాడుకునే సత్తా పార్టీ అధినేత చంద్రబాబులో పోయిందా? అధ్యక్షుడు రమణను మార్చాలని ఏళ్ల నుంచి వినిపిస్తున్న డిమాండును పట్టించుకోని, బాబు సాగతీత- నాన్చుడు ధోరణే అసలు సమస్యనా? రమణను తొలగించకపోతే, తెలంగాణ తమ్ముళ్లు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారా? ఆఫీసులోని అన్న విగ్రహం వద్దనే ధర్నాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా?.. తాజాగా జరుగుతున్న పరిణామాలు దీనికి అవుననే సమాధానమిస్తున్నాయి.

 

తత్వం బోధపడినా అనుభవం కాని చంద్రబాబు నాన్చుడు వైఖరి, ఇప్పటికే  తెలంగాణలో టీడీపీ కొంప ముంచగా.. అది మరింత ముదురిన ఫలితంగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో కొంపకొల్లేరయ్యే ప్రమాదం తలెత్తింది. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అసమర్థ నాయకత్వానికి, దన్నుగా నిలిచిన చంద్రబాబు అందుకు త్వరలో మూల్యం చెల్లించుకోనున్నారు. రమణను మార్చాలని తెలంగాణ తమ్ముళ్లు ఎన్నిసార్లు కోరినా బాబు,  ‘చూద్దాం.. మాహాడతాం’ అనే పడికట్టు పదాలు తప్ప, అంతర్గత  సమస్యపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.

 

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఇప్పటివరకూ రమణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ పార్టీ బతికి బట్టకట్టింది లేదు. రమణ నియంతృత్వ వైఖరి వల్లే.. గతంలో గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిందన్న విమర్శలున్నాయి. రమణ ఒంటెత్తు పోకడల వల్ల.. అప్పట్లో ఎంపీగా ఉన్న గరికపాటి మోహన్‌రావు సహా, సీనియర్లంతా పార్టీని వీడారన్న ఆరోపణలూ లేకపోలేదు. గత గ్రేటర్ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికల టికెట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా మూటకట్టుకున్నారు. ఇన్ని వైఫల్యాలు మూటగట్టుకున్నా.. రమణను మార్చకపోవడం చంద్రబాబు లోపమేనని, ఆయన నిరాసక్తత- సాగతీతే పార్టీకి అసలు సమస్య అని సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. రమణను ఎందుకు కొనసాగిస్తున్నారో, ఆయనపై బాబుకు ఎందుకంత అభిమానమో అర్ధం కావడం లేదంటున్నారు.

 

కాగా, ఈనెల 27న టీడీపీ ఏపీ-తెలంగాణ-జాతీయ కమిటీలు ప్రకటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి ముందే, తెలంగాణ రాష్ట్ర -జిల్లా నాయకులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. రమణను మార్చాలని రాష్ట్ర కమిటీలో ముగ్గురు మినహా, మిగిలిన నేతలంతా బాబుకు లేఖాస్త్రం సంధించడం సంచలనం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం పార్టీ ఆఫీసులోనే భేటీ అయిన, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు..  రమణను మార్చాలని, ఆయన తమకు పోటీగా జిల్లాల్లో నేతలను ప్రోత్సహిస్తున్నారని, కోర్ కమిటీలో అనామకులకు స్థానం కల్పిస్తున్నారని బాబుకు లేఖ రాయాలని నిర్ణయించారు. తెలుగుమహిళా అధ్యక్షురాలు జోత్స్నను కోర్ కమిటీ మీటింగుకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.

 

అయితే, ఆ సమావేశం వివరాలు తెలుసుకున్న రమణ, హటాత్తుగా అక్కడికి వెళ్లారట. నా అనుమతి లేకుండా ఇక్కడ మీటింగు ఎలా పెడతారని గుడ్లు ఉరిమారట. ఇష్టం ఉన్న వాళ్లు ఉండండి. లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోండని గద్దించారట. ఆ తర్వాత మరోమారు భేటీ అయిన తమ్ముళ్లు, రమణను మార్చకపోతే పార్టీ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. బాబుకు ఆరకంగా లేఖాస్త్రం సంధించిన వారిలో, 14 మంది జిల్లా పార్టీ అధ్యక్షులున్నట్లు సమాచారం. కాగా పార్టీ ఆఫీసులో ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.

 

కాగా త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో.. సీపీఐ-సీపీఎం సహా ఇతర పార్టీలతో పొత్తు కోసం, రమణ చేస్తున్న ప్రయత్నాలపై హైదరాబాద్ నేతలు విరుచుకుపడతున్నారు. గతంలో కూడా రమణ అసమర్ధ నాయకత్వం వల్లనే హైదరాబాద్‌లో పార్టీ ఓడిందని, ఇప్పుడు మళ్లీ పొత్తుల పేరుతో ఆయన పార్టీని ముంచే ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. అసలు హైదరాబాద్ పార్టీ వ్యవహారాల్లో, రమణ జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.

 

ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించకుండా.. అది విపత్తుగా మారేంతవరకూ, నాన్చుడు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు వైఫల్యమే, ఈ దుస్థితికి కారణమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘రమణ స్థానంలో సారు దగ్గర ఉండే మాణిక్యాన్ని పెట్టినా బాగా నడుపుతారన్న’ వ్యంగ్యోక్తులు, పార్టీ ఆఫీసులో బహిరంగంగానే వినిపిస్తుంటాయి. పార్టీ నేతలకే తెలిసిన ఈ సత్యం, ఇప్పటిదాకా  బాబుకు తెలియకపోవడమే ఆశ్చర్యమంటున్నారు. పార్టీ అధినేతగా బాబు ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నారని, అందుకే అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకున్నారని ఓ సీనియర్‌నేత వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు భయపడి, తెలంగాణలో పార్టీని విడిచిపెట్టారన్న చర్చకు, బాబు ఇప్పటివరకూ తన పనితీరు ద్వారా తెరదించలేకపోయారు. అయినప్పటికీ,  ఉన్నంతలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కూడా.. బాబు చేస్తున్న జాగుకు విసిగి, పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చేదు అనుభవాలెదురవుతున్నా, బాబు ఇంకా అదే నాన్చుడు ప్రపంచంలో జీవించడం ఏమిటో?

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.