ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించడం అరుదుగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తన అర్ధాంగి నారా భువనేశ్వరి గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటారు. శనివారం (మార్చి 8) ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆమెకు సర్ ప్రైజ్ గిప్ట్ కొనుగోలు చేశారు. తన పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఓ చీరల స్టాల్ ను సందర్శించిన చంద్రబాబు... తన అర్ధాంగి కోసం ఓ పట్టుచీర కొన్నారు. బేరం ఆడి మరీ చీరను కొన్నారు. చీర ఎంతకు అమ్ముతున్నావమ్మా అని స్టాల్ లో ఉన్న మహిళను చంద్రబాబు అడిగారు. రూ.26,400 అని ఆ మహిళ బదులిచ్చింది. ఆ చీరను రూ.25 వేలకు ఇవ్వమని బేరం ఆడి కొన్నారు. వ్యాపారం ఎలా సాగుతుందమ్మా అని ఆప్యాయంగా అడిగారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తన సతీమణి భువనేశ్వరికి స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నారు. ఆయన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభించిన తర్వాత ప్రతి స్టాల్ దగ్గరకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు.భార్య కోసం స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు. ఆ చీరల ప్రత్యేకత గురించి చంద్రబాబు అప్పట్లో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత జరిగిన తొలి చేనేత దినోత్సవంలో రెండు చీరలు కొనడం ఆసక్తి కలిగించింది.
చంద్రబాబు అరెస్టు సమయం నుంచి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్రాన్ని చుట్టుముట్టారు. ఆమె తన భర్త చంద్రబాబుకు ప్రజలే తొలి ప్రాధాన్యత అని… కుటుంబం ఆ తరువాతేనని భువనేశ్వరి చెబుతుంటారు.తనకు ఆయన ఓ చీర కొనిచ్చి దాదాపు 30 ఏళ్ళు అయి ఉంటుందని నాడు తెచ్చినప్పుడు కూడా తనకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యిందని... దాన్ని భద్రంగా బీరువాలో దాచుకున్నానని ఆ తర్వాత భువనేశ్వరి సరదాగా చెప్పారు. భువనేశ్వరి వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకునే ఆమెకు ఓ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే బాబు ఈ చీర కొన్నారని అనుకోవచ్చు.. గతానికి భిన్నంగా చంద్రబాబు ఇటీవలి కాలంలో కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వారితో కొంత సమయం కేటాయిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-buys-saree-after-bargaining-with-ardangi-bhuvaneshwari-39-194094.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.