బాబు విజన్ కు దక్షిణాది సీఎంలు ఫిదా.!

Publish Date:Aug 20, 2026

Advertisement

దక్షిణాది రాష్ట్రాల సమగ్ర వికాసం, ఆర్థిక పురోగతి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన కార్యాచరణ ప్రణాళికు విశేష స్పందన లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడు  మహాబలిపురంలో నిర్వహించిన  సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో నారా చంద్రబాబు   దక్షిణాది   ప్రగతికి అవసరమైన సమగ్ర ప్రణాళికలను స్పష్టమైన బ్లూప్రింట్ రూపంలో సభ ముందుంచారు.

ఈ కీలక సమావేశంలో  తమిళనాడు, కర్ణాటక, కేరళ,  పుదుచ్చేరి ముఖ్యమంత్రులు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.

అలాగే..  అమరావతి, బెంగళూరు, చెన్నై  మధ్య  సమగ్ర లాజిస్టిక్స్ నెట్‌వర్క్ నిర్మించాలని సూచించారు. జాతీయ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా   కీలకమని గుర్తు చేస్తూ,  వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారంలో దక్షిణాది కీలకమని ఉద్ఘాటించారు.  ఆధ్యాత్మిక రంగాన్ని ప్రోత్సహించేందుకు తిరుపతి కేంద్రంగా కాశీ, అయోధ్య, చార్‌ధామ్ ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ రూపొందించాలని చంద్రబాబు ప్రతిపాదించారు. 

అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో కీలక సూచనలు చేశారు. ఈ అనుసంధాన ప్రాజెక్టు ద్వారా   500 టీఎంసీల నీటిని మళ్లించవచ్చని, ఇది తమిళనాడు తాగు, సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారంగా మారుతుందన్నారు.  ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు  ఉమ్మడి సమన్వయంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దుగ్గరాజుపట్నం వద్ద పోర్టు, వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు.

సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యక్తంచేసిన సమగ్ర విజన్, ప్రాంతీయ సహకార ఆలోచనలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడిగా ఆయన కేవలం ఒక్క రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది ప్రగతిని కాంక్షిస్తూ విస్తృత దృక్పథంతో మాట్లాడారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక, మౌలిక వసతుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్వహించిన ఈ కౌన్సిల్ భేటీతో రాబోయే రోజుల్లో ప్రాంతీయ సమస్యల పరిష్కారం వేగం పుంజుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  

Chandrababu Naidu, Southern Zonal Council, Bullet Train Corridor, Godavari Cauvery Linking, Telugu News, TeluguOne

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.