చంద్రబాబు దంపతుల హాలీడే ట్రిప్: వైసీపీ దుష్ప్రచారంపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్.!
Publish Date:Sep 29, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. ఆ పార్టీ ఆరోపణలు, విమర్శలకు ఆధారాలు ఉండాలని భావించదు. ఆ పార్టీ ఎకో సిస్టమ్ (వ్యవస్థ)లోనే ఈ లోపం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటనపై కూడా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది. ఏపీ పొలిటికల్ ఎరీనాలో వైసీపీ తీరు ఎప్పుడూ విలక్షణమే. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో గత రెండు రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు రహస్యంగా వియత్నాం పర్యటనకు వెళ్లారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చెప్పాపెట్టకుండా చంద్రబాబు చేపట్టిన ఈ విదేశీ పర్యటన వెనుక భారీ కుట్ర ఉందంటూ క్యాంపెయిన్ ఆరంభించింది. వైసీపీ ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ కొట్టి పారేశారు. ఎదుటి వారి మీద పడి ఏడవడం మాని మీ పని చూసుకోండంటూ సుతిమెత్తగా కాకుండా ఘాటుగా, దీటుగా ఆ దుష్ప్రచారానికి చెక్ పెట్టారు. చంద్రబాబు దంపతులు వారి మనవడితో కలిసి చిన్న హాలీడే ట్రిప్ కు వెళ్లారని లోకేష్ స్పష్టం చేశారు. పనీ పాటా లేని వైసీపీ చంద్రబాబు పర్యటనపై అర్ధంపర్ధం లేని ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ ప్రచారంపై సామాజిక మాధ్యమ వేదికలో స్పందించిన లోకేష్.. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి తమ మనుమడు దేవాన్ష్‌తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారనీ, అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కూడా మనుషులేనన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. పొలిటికల్ యాక్టివిటీస్ తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలి కదా. చంద్రబాబు అందుకు మినహాయింపు కూడా ఏమీ లేదు. అయినా.. స్థానిక ఎన్నికల వేళ విదేశీ పర్యటనకు సిద్ధమైన జగన్ ను వదిలేసి వైసీపీయులు, చంద్రబాబు మనవడిని తీసుకుని భార్యతో హాలీడే ట్రిప్ కు వెళ్లడంపై దుష్ప్రచారం ఏంటని పరిశీలులు విమర్శస్తున్నారు. అది పక్కన పెడితే.. విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ మాత్రం ఆయన విదేశీ పర్యటనపై పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వారుస్తోంది. [Chandrababu Naidu, YCP, AP Politics, Personal Tour, YCP Social Media, Naralokesh, Telugu One]
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-39-232944.html





