Publish Date:Oct 26, 2012
చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర.. తెలంగాణలో కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేట్టు కనిపిస్తోంది. బాబు రాజోలిలో అడుగుపెట్టిన రోజున పొలిటికల్ జెఎసి నేతలు తీవ్రస్థాయిలో నిరసన తెలిపి అరెస్టైన విషయం తెలిసిందే. ముందుకు పోయినకొద్దీ చంద్రబాబుకి జనం మద్దతిస్తున్న తీరుని చూస్తుంటే.. శాంతి నగరంలో జెఎసి నేతలు చేసిందంతా స్టంటన్న విషయం చాలామందికి ఇట్టే అర్థమౌతుంది. పాదయాత్ర మొదలుపెట్టేముందు బాబు చేసిన రెండు పనులు ఆయనకు ఇప్పుడు బాగా కలిసొస్తున్నాయ్. తెలంగాణ విషయంలో కేంద్రానికి లేఖరాయడం వాటిల్లో ఒకటైతే, ఎస్సీల వర్గీకరణ రెండో అంశం. కులసమీకరణాల ఆధారంగా నడుస్తున్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కోవర్గం ఒక్కో పార్టీకి కొమ్ముకాస్తోంది. రెడ్లంతా కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడితే, వెలమలు టిఆర్ ఎస్ పక్షాన నిలుస్తున్నారు. ఇప్పుడు టీఆర్ ఎస్ లో కూడా వెలమ వర్సెస్ రెడ్డి ఆధిపత్యపోరు నడుస్తోందని కొందరు అనుకుంటున్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే కాపులు.. ఇప్పుడు చిరంజీవి రాకతో పూర్తిగా కాంగ్రెస్ వైపుకి మళ్లారు. ఇక మిగిలింది. బీసీల్లోని ఇతర కులాలు, ఎస్సీలు, ఎస్టీలు. వీళ్లని ఆకర్షించగలిగితే ఓటు బ్యాంక్ బలపడుతుందన్న చంద్రబాబు ఎత్తుగడ పారినట్టే కనిపిస్తోంది. తను అధికారంలోకి రాగానే మాదిగల రుణం తీర్చుకుంటానంటూ బాబు చేసిన వ్యాఖ్యలు జనంమీద బాగానే పనిచేస్తున్నాయ్. కేవలం తెలంగాణ ఏర్పాటు అనే మాట తప్ప తమకు ప్రత్యేకంగా టిఆర్ ఎస్ వల్ల ఒరిగేదేంలేదని తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలు గట్టిగా అనుకుంటున్నారు. ఆ కారణంగా వాళ్లంతా తెలుగుదేశం పార్టీ వైపుకే మొగ్గుచూపుతున్నట్టుగా కనిపిస్తోందని టిడిపి నేతలు అనుకుంటున్నారు. ఇదే నిజమైతే తెలంగాణలో టిడిపి బీసీల మద్దతు కంచుకోటలా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ విషయంలో చంద్రబాబు ఎత్తుగడని ఎలా ఎదుర్కోవాలో తెలీక మిగతా పార్టీలు తలలు బాదుకుంటున్నాయ్. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే రాబోయే రోజుల్లో చంద్రబాబు మరో సారి కాబోయే ముఖ్యమంత్రవుతారని టిడిపి క్యేడర్ బలంగా నమ్ముతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-meekosam-telangana-24-18519.html
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.