చంద్రబాబు నా అన్నయ్య.. విజయసాయి!

Publish Date:Jul 16, 2022

Advertisement

రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండొచ్చు. వేర్వేరు పార్టీల్లోని వేర్వేరు వ్యక్తులు అన్నదమ్ముల్లా మసలుకోనూ వచ్చు. వాస్తవానికి రాజకీయ నేతలందరిదీ ఒకే కుటుంబం.. అదే రాజకీయ కుటుంబం. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి తమ్ముడు.  అవును.. మీరు సరిగ్గానే విన్నారు. చంద్రబాబు నాయుడికి విజయసాయిరెడ్డి వరసకు తమ్ముడు అవుతారు. రాజకీయంగా అనుక్షణం ఉప్పు నిప్పులా విమర్శలు, ఆరోపణలు చేసుకునే చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఉందా అన్న ఆశ్చర్యం అనవసరం. ఎందుకంటే  ఇది నిజంగా నిజం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని విజయసాయిరెడ్డే స్వయంగా బయటపెట్టారు.

 అది కూడా చంద్రబాబును, టీడీపీ నేతలను విమర్శించే క్రమంలోనే తమ బంధుత్వాన్ని విజయసాయి వెల్లడించడం గమనార్హం. చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఎలా ఏర్పడిందంటే.. విజయసాయి భార్య సోదరి కుమార్తెని దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు తారకరత్న పెళ్లి చేసుకున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు తనకు వరసకు అన్నయ్య అవుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అరబిందో సంస్థకు, అదాన్ కంపెనీకి విజయసాయిరెడ్డి బంధువు ఒకరు కామన్ డైరెక్టర్. దీంతో అడాన్ కంపెనీతో తనకు సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు విజయసాయి ఫైరవుతున్నారు.

ఒక డైరెక్టర్ ఎన్నో సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నంత మాత్రాన ఆయా కంపెనీలన్నీ ఆయనవి అయిపోతాయా? అనేది విజయసాయి ప్రశ్న. చంద్రబాబు తనకు వరసకు అన్న అవుతారని.. అలా అయితే.. చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా? అనేది విజయసాయి ప్రశ్న. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అఫీషియల్ ట్విటర్ వేదికగా విజయసాయి రాసుకొచ్చారు.

ఉదయం లేచింది మొదలు టీడీపీపైన, చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు, ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డికి చంద్రబాబు అన్నయ్య అవుతారన్న వాస్తవాన్ని విమర్శిస్తూనే బయటపెట్టారు. ఇంతకీ విజయసాయి ఇప్పుడీ విషయాన్ని ఎందుకు బయటపెట్టినట్టు. ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే, మరో వైపు అన్న అంటూ బంధుత్వాన్ని ఎందుకు కలుపుకున్నట్లు అన్న ప్రశ్నలకు ముందు ముందు తెలుగుదేశంతో ఏ రాజకీయ అవసరాలు ఉంటాయో అన్న సందేహమే కారణమని సామాజిక మాధ్యమంలో విజయసాయిపై సెటైర్లు పేలుతున్నాయి.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.