నెల్లూరు నేతలను గాడిన పెడుతున్న చంద్రబాబు!

Publish Date:Apr 4, 2026

Advertisement

- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం దారి తప్పిందని ముఖ్యమంత్రికి అర్ధమైంది
- మంత్రి నారాయణ, ఎమ్పీ విపిఆర్‌లకు బాధ్యతల నుంచి విముక్తి
- ఉదయగిరి ఎమ్మెల్యేకి తల వాచే చీవాట్లు
- సూళ్లూరుపేట నేతలకు పదునైన చురకలు

- దేముళ్ల సేవతో సరిపెట్టుకోవద్దని రామనారాయణరెడ్డికి సూచన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా మీద సునిశిత దృష్టి సారించినట్లు అర్థమవుతున్నది. నెల్లూరు జిల్లా సాధారణంగా  సామాజిక పరిస్థితుల దృష్ట్యా వైకాపాకు బలమైన స్థావరం. కానీ మొన్నటి ఎన్నికలలో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. అదొక విచిత్రం. అన్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది. అంటే..  తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలలోనే తమ భవిష్యత్ మీద నమ్మకం సడలిందన్న మాట. అదేమీ ఒకరు చేసే ఆరోపణ కాదు.  కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. దేనివల్ల ఈ పరిస్థితి? 30 నుంచి 75 వేల మెజారిటీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలను గెలిపించిన నెల్లూరు జిల్లా ఓటర్లకు అప్పుడే ముఖం మొత్తిందా? పార్టీ మీద లేదా పదవులలో వున్న వారి మీద విరక్తి జనించిందా? అందుకు కారణం ఏమిటి?

జిల్లా పరిస్థితి బాగా లేదన్న వార్తలు ముఖ్యమంత్రి చెవికి కూడా చేరినట్లున్నాయి. పడవకు పడిన లేదా పడుతున్న చిల్లుని, చిన్నదిగా వున్నప్పుడే పూడ్చకుంటే, మొత్తం పడవే మునిగిపోతుందన్న ఆలోచనతోనే, నెల్లూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లున్నారు.

ఈ వారంలో రెండు ఊళ్లకు వచ్చారాయన. ఈ రెండు ఊళ్లను ఎంపిక చేసుకోవడంలో ఏదో ఒక పరమార్థం వుందని భావించాలి. మొదట సూళ్లూరుపేట. ఎమ్మెల్యే విజయశ్రీ మీద తనకు సదభిప్రాయం వుందనే సూచన ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంబిబిఎస్ చదివిన ఉన్నత విద్యావంతురాలిగానే కాకుండా, నిరంతరం నవ్వుముఖంతో కనపడడం విజయశ్రీ విలక్షణత. ఎవరినైనా నవ్వుతోనే పలకరిస్తారు. ఆమె మీద ఆరోపణలు లేవు. అయితే సూళ్లూరుపేట నుంచి మద్రాసు నగరానికి ఎర్ర గులక, ఇసుక ఎవరు దొంగ రవాణా చేస్తున్నారో నాకు తెలుసు, వారీ అక్రమాలు తక్షణమే నిలిపివేయండి అని గట్టిగానే హెచ్చరిక చేశారు. ఎవరికి తగలాలో వారికి ఆ మాటల శూలం బలంగా గుచ్చుకున్నది. గుండె కలుక్కుమన్నది. లక్షల రూపాయల అక్రమ రాబడి ఆగిపోతుందనుకునే బాధే కదా పాపం.

పనిలో పనిగా, విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి కూడా, ఇక నువ్వు రిటైర్ అయితే బాగుంటుందని నవ్వుతూనే సలహా ఇచ్చారు. ఆ మాటలో పరుషత్వం లేకపోవడంతో నెలవల సంతోష పడిపోయాడు. సూళ్లూరుపేట ఎస్‌సి నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే పసిపిల్ల కావడంతో ముదురు మనుషులు పెత్తనం చలాయిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లుంది. కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడట, ఒక్క ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫార్సులు తప్ప ఇతరులెవరి మాటా మీరు వినాల్సిన అవసరం లేదని. ఈ మాటకు కొందరి ముఖాలలో గంటు పడింది.

వెంటనే.. వింజమూరు. అక్కడికి రాకముందే స్థానిక పరిస్థితుల మీద సమగ్ర అవగాహన తెచ్చుకున్నట్లున్నారు చంద్రబాబు. ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద చర్నాకోళ ఝుళిపించారు. వాతలు పడేట్లు, మాటలు విసిరారు. రేపటి ఎన్నికలలో రాష్ట్రంలో 175 మంది తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే, నువ్వు 172 వాడిగా ఉంటావు. ఇంత తక్కువ వ్యవధిలో అంత చెడ్డ పేరు తెచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నీ సొంత సామాజిక వర్గం కూడా నిన్ను సమర్థించడం లేదు. పార్టీ కార్యకర్తలందరూ విసిగిపోయి వున్నారు. తీరు మార్చుకోవడానికి మూడు నెలల గడువు ఇస్తున్నాను, మారితే మర్యాదగా వుంటుంది, లేకుంటే చర్యలు వేరేగా వుంటాయని  కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇదేదో గదిలోకి పిలిచి, ఎవరూ వినకుండా హితబోధ చేసి వుంటే గౌరవంగా వుండేది.. కానీ, కార్యకర్తల సమావేశంలో అందరి సమక్షంలో తూర్పార పట్టడం వల్ల, పాపం కాకర్ల సురేష్ నిరుత్తరుడైపోయారు. ఉదయగిరి కార్యకర్తలు మాత్రం పండుగ చేసుకున్నారు.

ఇక జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన సవరణలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. అందులో ఓం ప్రథమంగా మంత్రి నారాయణకు, ఎమ్పీ విపిఆర్‌కు, మీ పనులు మీరు చేసుకోండి, జిల్లా బాధ్యత వదిలి పెట్టేయండి అని సూచించారట. ఈ సూచన సున్నితంగా, మనసు నొచ్చుకోకుండా ఉందని చెబుతున్నారు. మరి జిల్లా బాధ్యత ఎవరిది? ఆ బరువు మరొక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భుజాలపై పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ దేముళ్లు, దేవాలయాలేనా.. అప్పుడప్పుడైనా రాజకీయాలు కూడా చూసుకోవాలి కదా అని సుతారంగా మందలించారని వినికిడి.  దానిలో నువ్వే ఈ భారం మోయాలి అనే సూచన వుందని మనం భావించవచ్చు.

మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పట్టుజారక ముందే పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో కలగడం కార్యకర్తలకు సంతోషం కలిగిస్తున్నది. ఆ మాత్రం రాజకీయ సవరణలు చేపడితే, పదికి పది గెలవకపోయినా, పదికి పది కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

జమీన్ రైతు సౌజన్యంతో

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.