ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు.. ఎప్పుడంటే?

Publish Date:Nov 24, 2023

Advertisement

అధికారంలో ఉన్నామా? విపక్షంలో ఉన్నామా? అన్న ధ్యాసే లేకుండా నిత్యం రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యం  ఏడు పదుల వయస్సులోనూ యువనాయకుల కంటే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పర్యటలు చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం పై సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సైతం సిద్ధమయ్యే చంద్రబాబు దాదాపు రెండు నెలలుగా ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు.   స్కిల్ కేసు పేరిట  జగన్  ప్రభుత్వం చంద్రబాబును ఆయన నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్టు చేయడం తదననంతర పరిణామాలు తెలిసినవే.  

స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బైలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయన పై కేసుల మీద కేసులు వేస్తూ ఏదో ఒక కేసులో మళ్ళీ బాబుని అరెస్టు చేసి ప్రజా జీవితానికి దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉంది. జగన్  ప్రభుత్వం బాబు చుట్టూ అల్లిన కేసులను ఛేదించుకుని ప్రజల మధ్యకు రావడానికి ఆయన న్యాయపోరాటాన్నే నమ్ముకుంది. న్యాయపోరాటాలతో కేసుల నుండి ఊరట పొందిన తరువాతనే చంద్రబాబు పూర్తి స్థాయిలో  ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ సర్కార్ చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులన్నీ దూరిపింజెల్లా ఎగిరిపోవడం ఖాయమని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. నేడో, రేపో సుప్రీంలో క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడితే చంద్రబాబు పులు కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటపడినట్లేనని అంటున్నారు. అయితే చంద్రబాబుపై వరుసగా కేసులు బనాయిస్తూ ఆయనను ప్రజాక్షేత్రంలోకి రానీయకుండా చేయడానికి జగన్ సర్కార్ ఎందుకు తహతహలాడుతోందంటే ఆయన జనంలో ఉంటే.. ఇప్పటికే దిగజారిపోయిన జగన్ గ్రాఫ్ మరింత పాతాళానికి పడిపోతుందని అందరికంటే బాగా జగన్ కే తెలుయడమే.

ఆయన గొంతు జనానికి వినపడకుండా చేయగలిగితే.. తన సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరగకుండా ఉంటుందన్న అభిప్రాయంతో కక్షగట్టి ఇలా చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలకు తనదైన శైలిలో చెక్ పెట్టి బాబు తిరిగి తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ నేతలను ప్రభుత్వం పై యుద్దానికి సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ ప్రభుత్వం పై పోరాటానికి బాబు రంగం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ లోగా క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందనీ, కచ్చితంగా సర్వోన్నత న్యాయస్థానం తన క్వాష్ పిటిషన్ కు అనుకూలంగానే తీర్పు ఇస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారంటున్నారు.

హైకోర్టు రెగ్యులర్ బెయిలు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు స్కిల్ కేసులో ఏపీ సీఐడీ విచారణ ఎంత లోపభూయిష్టమో తేలిపోయిందనీ, సుప్రీం కోర్టులో కూడా అదే జరుగుతుందనీ పార్టీ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నాయి.  సో.. డిసెంబర్ మొదటి వారం నుంచీ చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి పాలనపై చండ్ర నిప్పులు చెరుగుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.