Publish Date:Oct 17, 2024
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతున్నారు. గురువారం నాడు ఛండీగఢ్‌లో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు అతిథిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం అని చెబుతూ, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఆహ్వానమంటూ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నూతన అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ డూయింగ్ బిజినెస్, ఫాస్ట్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. "ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ వ్యాపార, పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇంతకంటే మంచి సమయం లేదు. అభివృద్ధి ప్రయాణంలో ఏపీతో సహకరించండి. నూతన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-in-chandigarh-25-186960.html
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.