లోకేష్ కు చంద్రబాబు కర్తవ్య బోధ

Publish Date:Oct 28, 2022

Advertisement

సైన్స్ గణితం మీదా శ్రద్ధపెట్టమని చింటూకి వాళ్ల నాన్న ముద్దుగా చెప్పాడు, ఇక నుంచి నీ పనులు నువ్వే చేసుకోవడం నేర్చుకోమని పింకీకి వాళ్లమ్మ చెప్పారు, లెక్కల మాస్టార్ని తన బాధ్యతలూ కొద్ది రోజులు చూసుకోమని హెడ్మాస్టర్ చెప్పారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు తన కుమా రుడు నారా లోకేష్కి మంగళగిరి బాధ్యతలు పూర్తిగా చేపట్టి విజేతగా నిలవమని కర్తవ్యబోధ చేశారు. 

ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి ఎంతో అవకాశం ఉండడంతో తెలుగు దేశం నాయకులు రెండిం తల ఉత్సాహం తో దూసుకుపోతున్నారు. అయితే ఈపర్యాయం తప్పకుండా అధికారంలోకి రావాలంటే అందరం మరింత శ్రమించాలని, మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని  ఏమాత్రం నిర్లఓ్యం తగదని ఇప్పటికే అధినే చంద్రబాబు టీడీపీ వర్గాలకు చిన్న క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో  పార్టీ పరిస్థితిని, ఆ ప్రాంత నాయకుల పనితీరును  చంద్రబాబు సమీక్షించారు. లోకేష్ను మంగళగిరి బాధ్యతలను లోకేష్ చేతుల్లో పెట్టారు. అక్కడ చరిత్రను తిరగరా యాలని ఉత్సాహపరిచారు. అలాగే నియోజకవర్గాల ఇన్ ఛార్జ్లతో కూడా చంద్రబాబు వన్ టు వన్ సమావేశమై పరిస్థి తుల గురించి కూలంకషంగా చర్చించారు. 

రాష్ట్రంలో జగన్ పాలనపట్ల విపరీత వ్యతిరేకత వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణాన్ని పూర్తిగా వినియో గించుకుని అధికారంలోకి రావాలన్న లక్ష్యం తెలుగు దేశం నాయకుల్లో ఉంది. ప్రజలు అన్ని విధాలా వైసీపీ  ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. జగన్ అన్నివిధాలా విఫలమ య్యార న్నది ప్రజల వ్యతిరేకతే  తెలియజేస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కాలం గడిపేయ కుండా పార్టీని మరింత  బలోపేతం చేయడం, పార్టీని గెలిపించడం మీదనే దృష్టి పెట్టాలని  టీడీపీ పార్టీ అధినేత సూచించారు. 

మంగళగిరి నియోజకవర్గంపై ఇంచార్జ్ నారా లోకేష్ తో పార్టీ అధినేత సమీక్ష జరిపారు. పార్టీ కార్యక్ర మాలు, కమిటీల నియామకం, స్థానిక నేతల పనితీరు వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983,1985 ఎన్నికల్లో మంగళగిరిలో టిడిపి గెలిచిందని…1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

పొత్తుల్లో రెండు దశాబ్దాల పాటు మంగళగిరి సీటు వేరు పార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చిన కారణంగా నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం, ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే  దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తిరుగు లేని విజయంతో మంగళగిరిలో కొత్త చరిత్ర రాయాలని ఇంచార్జ్ లోకేష్ కు పార్టీ అధినేత సూచించారు.

నాలుగు నియోజవర్గాల ఇంచార్జ్లతో ముఖాముఖీ భేటీలు జరిగాయి. కర్నూలు ఇంచార్జ్ టిజి భరత్, ఇచ్చాపురం ఇంచార్జ్ బెందాళం అశోక్ రివ్యూలకు హాజరయ్యారు. ఇప్పటికి మొత్తం 111 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో ముఖాముఖి సమీక్షలు ముగిశాయి.

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.