శ్రీలంకలా ఏపీ?.. సంక్షోభం త‌ప్ప‌దు!.. కొత్త జిల్లాలతో త‌ప్పులు!?

Publish Date:Apr 4, 2022

Advertisement

జ‌గ‌న్‌ ప్రభుత్వ విధానాలతో.. ఆర్థిక సంక్షోభంతో.. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని ద‌గ్గ‌ర‌ జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలతో ఏపీ కూడా తీవ్ర సంక్షోభం దిశగా ప్రయాణిస్తోందని ప్రధానితో వివిధ శాఖల అధికారులు చెప్పిన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉందని అన్నారు. 

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో జరిగిందని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటుపై  ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిణగలోకి తీసుకోకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు.

రాష్ట్రంలో జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే.. ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని చంద్రబాబు విమ‌ర్శించారు. ఇసుక, మద్యం దొపిడీ, నిత్యావసరాల భారం వెనుక జగన్ దోపిడీ ఉందన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సహజ వనరుల దోపీడీకి పాల్పడుతున్న జగన్.. ప్రభుత్వానికి ఆదాయం కోసం విపరీతంగా పన్నులు వేస్తున్నారని, అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. 

విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉండే ఏపీలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతోందని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్ కోతలకు, పెరిగిన విద్యుత్ బిల్లులకు ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

టీడీపీ స్ట్రాటజీ మీటింగ్‌లో చర్చించిన అంశాలు:
1. రాష్ట్రంలో కరెంట్ చార్జీల రేట్లు పెంచడం, నిత్యావసర ధరలు, చెత్తపన్ను, పెట్రో మంట, భారమైన గ్యాస్ ధరలపై గ్రామ స్థాయిలో బాదుడే బాదుడు పేరుతో టీడీపీ ఇంటింటికి వెళ్లాలని నిర్ణయించారు. ధరలు పెంచి ఒక్కో కుటుంబంపై రూ.లక్షల్లో భారం వేస్తున్నారు. జగన్ ప్రభుత్వ బాదుడు కారణంగా పేదలపై ఎంత భారం పడుతుంది అనే విషయాలను కరపత్రాల ద్వారా ప్రచారం చెయ్యనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించారు. 

2. అమరావతి నిర్మాణానికి మరో 5 ఏళ్ల సమయం కావాలని ప్రభుత్వం చెప్పడాన్ని నేతలు తప్పు పట్టారు. 80 శాతం పూర్తి అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్.. ఇప్పుడు మరో 5 ఏళ్లు సమయం కోరడాన్ని సమావేశం తప్పు పట్టింది. 

3. జగన్ పాలనపై చివరికి ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. తను అనుకున్న కొందరి వ్యక్తులకు, అదికూడా వ్యక్తి గత అవసరాల కోసం పదవులు ఇస్తున్నారని అన్నారు. సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్ లు ఇస్తున్న విధానంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందన్నారు. జగన్ ప్రభుత్వ విధానాల కారణంగా రెడ్డి సామాజికవర్గంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల  ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. జగన్ కు ఓటేసి తప్పు చేశామనే భావన ఇప్పుడు సొంత వర్గంలో కూడా విస్తృతం అయ్యిందన్నారు.

4. సీపీఎస్ విషయంలో ఆందోళనలు చేస్తున్నవారికి టీడీపీ తన సంఘీభావం తెలియజేసింది. అదేవిధంగా వైజాగ్ లో జరిగిన ల్యాండ్ స్కామ్ ను, దేవాలాయాలపై దాడులను సమావేశంలో నేతలు ఖండించారు. విశాఖ మధురవాడలో IT హిల్స్ నందు రూ.1,550 కోట్ల విలువ చేసే భూదందాకు ఏ2 విజయసాయిరెడ్డి పాల్పడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి.

5. రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా, అమ్మకం జరుగుతోందని...దీని ద్వారా వేల కోట్లు జగన్ ఆర్జిస్తున్నాడని నేతలు అన్నారు. ప్రభుత్వ లిక్కర్ షాపుల ద్వారానే నెంబర్ 2 మద్యం అమ్ముతున్నరని...అధికారికంగా ఈ దోపిడీ తంతు నడుస్తోందని నేతలు అన్నారు. కల్తీమద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.