చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన? ఎందరు మంత్రులపై వేటంటే?

Publish Date:Mar 21, 2026

Advertisement

చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారా? అంటే పరిశీలకుల నుంచి మాత్రం విస్తరణ కాదు ప్రక్షాళనకు ఆయన మొగ్గు చూపుతున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. కాగా చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళనపై గత కొన్ని రోజులుగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనీ, అందుకే కేవలం కేబినెట్ విస్తరణకు, పునర్వ్యవస్థీకరణకు పరిమితం కాకుండా సమూల ప్రక్షాళనే బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారనీ పార్టీ వర్గాల నుంచి కూడా వినబడుతోంది.  

చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. శాఖల వారీగా జరిగే సమీక్షలలోనే సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరును కూడా మదింపు చేస్తూ వస్తున్నారనీ, ఇప్పుడు ఆ మదింపే ప్రామాణికంగా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  అయితే చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన అంటూ చేస్తే ఎంత మందిపై వేటు పడుతుంది? ఎందరిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటారు? ఎవరెవరి శాఖలు మారుస్తారు అన్న దానిపై పలు అభిప్రాయాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.

అయితే పార్టీ సీనియర్ నేతలు మాత్రం పెద్ద సంఖ్యలో కేబినెట్ నుంచి ఉద్వాసనలు ఉండే అవకాశం లేదనీ, పని తీరు మెరుగు పరుచుకునేందుకు కనీసం ప్రయత్నించని ఒకరిద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందనీ అంటున్నారు.  

ఇక కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే వారిలో యువకులకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ పని తీరును మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన, మంత్రుల పనితీరుపై ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు జరుగుతాయని చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.