తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు: సిపిఐ.నారాయణ

Publish Date:Apr 20, 2026

Advertisement

తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ  అన్నారు.  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న  తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, అటువంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.  

 అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారనీ..  ఆ విషయాన్ని   తెలుగు ప్రజలు గానీ మర్చిరన్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందన్న నారాయణ..  చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని చెప్పారు.

By
en-us Political News

  
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.