చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే.. ఇండియన్ లీగల్ సంచలన కథనం!

Publish Date:Oct 11, 2023

Advertisement

ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమా, సక్రమమా.. చంద్రబాబు నిజంగానే తప్పు చేశారా? లేక ఉద్దేశ్యపూర్వకంగానే ఇరికించారా అంటే తెలుగు రాష్ట్రాలలో చంటి  పిల్లల నుండి  వయోవృద్ధుల వరకూ అందరూ ముక్తకంఠంతో  చెప్పే మాట ఒక్కటే. చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. ఆయనను రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారు అని. విద్యార్థుల నుండి మేధావుల వరకూ.. రిటైర్డ్ అధికారుల నుండి మాజీ న్యాయమూర్తుల వరకూ అందరిదీ ఇదే మాట. ఈ కేసులో చంద్రబాబు పాత్ర లేదు.. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ.. ఒక్క వైసీపీ తప్ప రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. ఇప్పటికే ఈ విషయంపై  వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ జాతీయ పార్టీలన్నీ ఖండించాయి. ఏపీలో వైసీపీ అరాచకాలు శృతిమించిపోతున్నాయని హెచ్చరించాయి. 

 ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై  ఓ జాతీయ మీడియా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. న్యాయ వ్యవస్థ, అందులోని కోణాలను విశ్లేషించే ప్రముఖ పత్రిక  ఇండియాలీగల్‌  చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా ఇరికించారంటూ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఎంతలా ఉపయోగించుకుంటున్నారనడానికి చంద్రబాబు అరెస్ట్ ఒక నిదర్శమని ఇండియా లీగల్ వెల్లడించింది.  చంద్రబాబు మరో బలిపశువా  అనే  శీర్షికతో  ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.   రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో అరెస్ట్ అవడమనేది కొత్తేమీ కాదని.. గతంలో చాలా మంది అరెస్ట్ అయ్యారని పేర్కొంది. చంద్రబాబుపై కేసును సుప్రీం కోర్టు జాతీయాంశంగా పేర్కొనాలని ఇండియా లీగల్ తన కథనంలో కోరింది. రాజకీయ నేతల చేతుల్లో పోలీసులు తొత్తులుగా మారారని, ఇలాగే పోలీసులు మితిమీరి ప్రవర్తించిన సందర్భాలలో గతంలో  కోర్టులు రంగప్రవేశం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. 

ఈ కేసును విశ్లేషిస్తూ.. అసలు చంద్రబాబును అరెస్ట్ చేశాక.. ఆధారాల కోసం యత్నించడమేంటని తీవ్రంగా తప్పు బట్టింది.  ఏపీలో ప్రజలు అనుమానిస్తున్నట్లే బీజేపీ పాత్రను కూడా ఈ కథనంలో పేర్కొనడం విశేషం. చంద్రబాబు బీజేపీతో స్నేహంగా ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేది కాదన్న ఇండియా లీగల్.. మొత్తానికి చంద్రబాబును కావాలని రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని పేర్కొంది.   ఇప్పుడు ఈ ఇండియా లీగల్ కథనంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో  మరింత విస్తృతంగా చర్చ జరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పరిశీలకులతో పాటు న్యాయ నిపుణుల విశ్లేషణలతో సాగే ఇండియా లీగల్ ఈ కథనాన్ని ప్రచురించడం తెలుగు తమ్ముళ్ల వాదనకు బలం చేకూర్చింది. చంద్రబాబును జైలుకు తరలించి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఈ కేసు విషయంలో కోర్టులు ఏదీ తేల్చకపోవడం..  ఇప్పుడు ఇలా సంచలన కథనాలు రావడం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడటం ఖాయమని అంటున్నారు.

నిజానికి  జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి మాట మరిచి కక్షలు కార్పణ్యాలకు తెరదీసిన సంగతి తెలిసిందే. తనను ప్రశ్నించిన వారి నామరూపాల్లేకుండా చేయాలని భావించే వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంను టార్గెట్ చేసుకునే పని చేసిందని అంటున్నారు. అయితే జగన్ సర్కార్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. జనంలో సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. స్వయంగా జగనే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరుగుతాయని  ప్రకటించేశారు. అంటే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇంకా పూర్తిగా ఆరు నెలల సమయం కూడా లేదు.  ఆ కారణంగానే జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న తెలుగుదేశం కు అడ్డుకట్ట వేయాలన్న ఏకైక లక్ష్యంతోనే  సీఐడీని రంగంలోకి దిగి అసలు పేరు, ఊరు లేని కేసులో తీవ్రమైన ఆర్ధిక నేరాలు చేసిన వారిపై బనాయించే సెక్షన్లను నమోదు చేసి అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేయించారు. దాని పర్యవసానమే ఇలా ఇంటా బయటా జగన్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇక ఇండియన్ లీగల్ కథనం విషయానికి వస్తే..

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ తేల్చేయడమే కాకుండా.. తన కథనానికి బలం చేకూర్చేలా  ఈ విషయంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రచురించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య.. న్యాయ వ్యవస్థ రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతూనే కొన్ని విషయాలలో రాజకీయపరంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అన్నారు. అయినా రాజకీయ కక్ష సాధింపునకు కేసులు పెట్టడం అన్నది అత్యంత తీవ్రమైన అంశమని అభిప్రాయపడ్డారు.  అలాగే ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్  బీజే కోల్ఫే పాటిల్ అయితే మరింత స్పష్టంగా చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని చెప్పేశారు. చంద్రబాబు కనుక బీజేపీతో మైత్రిలో ఉండి ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసులో పస లేకపోయినా రాజకీయ కక్ష  సాధింపుతో కేసులు బనాయించి అరెస్టు చేయాలనుకుంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఖైదును తప్పించుకోలేరన్నారు.  

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.