పవన్ మోడల్ ను అనుసరించాలని టీవీకే విజయ్ కు సూచించిన చంద్రబాబు!

Publish Date:Apr 22, 2026

Advertisement

తమిళ చిత్రసీమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తమిళగ వెట్రి కజగం  పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారుతాయా?  అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ని తన మిత్రపక్షం నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీశాయి. 

విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే..  ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు. పవన్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి నేడు ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. 

పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పటికీ, తక్షణ అధికారం కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడారు. ఓటములు ఎదురైనా వెరవకుండా, వెన్ను చూపకుండా నిలబడ్డారు.  ఆ నిబద్ధతే నేడు ఆయనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిందని చంద్రబాబు చెప్పారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు పరోక్షంగా సూచించారు. సినిమా క్రేజ్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ..  రాజకీయాల్లో స్థిరపడాలంటే ప్రజలతో మమేకం కావడమొక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు. 

తమిళనాడులో ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించుకున్నారో, విజయ్ కూడా అదే తరహాలో యువతను, మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు మాటల్లో కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది. 

మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం వారిరువురి మధ్యా ఉన్న బాండింగ్ కు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ త్యాగాలకు సిద్ధపడ్డారని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పడం కూటమి ధర్మాన్ని ఆయన తు.చ. తప్పకుండా పాటిస్తున్నారనడానికి తార్కానంగా చెబుతున్నారు.   మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయా ణం సాఫీగా సాగాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం పవన్ కల్యాణ్ ను మోడల్ గా తీసుకోవాలని చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.