పోరాట యోధుడు నాన్న..ఆయన అడుగుజాడల్లోనే నేను.. లోకేష్

Publish Date:Sep 11, 2023

Advertisement

తెలుగు తెర మీద కథానాయకుడిగా... తెనుగు పుడిమిపై మహానాయకుడిగా... మదరాసి పదంతో అడుగున పడిపోతున్న ఆంధ్ర జాతికి వెలుగు జిలుగులద్దిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.  అలాంటి ఆయన ఇంట కుమార్తెగా జన్మించి.. హెటైక్ సిటీ సృష్టికర్త.. హైదరాబాద్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కన్సెల్టెన్సీ అంటూ హైటెక్ పదానికి అర్థాన్ని.. పరమార్థాన్ని వివరించిన విజనరీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆర్థాంగి అయి.. ఆ జంట 43వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో.. అంటే సెప్టెంబర్ 10వ తేదీకి ఒక రోజు ముందు సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆయన్ని 14 రోజుల రిమాండ్ విధించడంతో... చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

అయితే ఇదే అధికార పార్టీకి చెందిన నేతలు.. నాడు కన్నతల్లిని ఘోరంగా అవమానిస్తే... నేడు అదే పార్టీకి చెందిన ప్రభుత్వం కన్నతండ్రినీ జైలు పాలు చేసింది. ఆ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. బాధతో బరువెక్కిన హృదయంతో.. చెమ్మగిల్లిన కన్నులతో మీ కోసం ఈ నాలుగు మాటలు అంటూ తీవ్ర భావోద్వేగంలో ఓ లేఖను సోషల్ మీడియాలో సంధించారు. ఆంధ్రప్రదేశ్ కోసం.. కోట్లాది తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయంతో పాటు ఆత్మను పణంగా పెట్టి పని చేశారని.. ఆ క్రమంలో ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా... అలుపన్నది లేకుండా పని చేయడాన్ని నేను పెరిగానని తెలిపారు.   

అలాగే ఆయన రాజకీయాలు నిజాయతీకి, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని...  ఆయన నుంచి  సేవలు పొందిన వారు.. చూపించిన ప్రేమ, కృతజ్జతతోపాటు లోతైన స్పూర్తి పొందడం.. నేను కళ్లారా చూశానని... వారి మనస్సుతో చెప్పిన కృతజ్జతతో... ఆయన హృదయం ఆనందంతో తొణకిసలాడేదని తెలిపారు. ఇది పసి పిల్లల ఆనందంతో సమానమని నారా లోకేశ్ అభివర్ణించారు. ఇది చూసి నా తండ్రి మార్గాన్నే నేను అనుసరించి.. ఆయన అడుగులో అడుగు వేశానని... అందుకోసం అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని సైతం వదిలి .. భారత్‌కు తిరుగు వచ్చానని నారా లోకేశ్ స్పష్టం చేశారు.  

కానీ నాకు.. మన దేశం మీద.. మన వ్యవస్థల మీద.. మన దేశానికి సంబంధించిన మూల సూత్రాల మీద.. అలాగే వీటన్నింటింకి మించి... మన రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉందని.. అయినప్పటికీ ఈ రోజు నా తండ్రి ఏ నేరం చేయకుండా.. అన్యాయంగా.. రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే.. నా కోపం కట్టలు తెంచుకొంటుందని... నా రక్తం మరిగిపోతుందన్నారు. 

దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం.. ఇంతలా కష్టపడిన నా తండ్రి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలని నారా లోకేశ్ ప్రశ్నించారు. పగ, ప్రతీకారం, విధ్వంసక రాజకీయాలను ఆయన ఏనాడు ప్రోత్సహించలేదని... మన ప్రజల అభివృద్ధి, సంక్షేమం, వారి ఆవకాశాలతోపాటు వారి భవిష్యత్తు కోసం ముందే ఊహించినందుకా.. అయినా రాజకీయ పగకు లోతులు కానీ.. హద్దులు కానీ ఉండవా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. కానీ అదీ ఈ రోజు నమ్మక ద్రోహంలా అనిపిస్తుందన్నారు. 

కానీ మా నాన్న ఓ పోరాటయోధుడు, నేను ఆయన లాగానే.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతామని.. అయితే ఈ పోరాటంలో నాతో  కలిసి మీరు అడుగు వేయాలని కోరుకుంటున్నానని నారా లోకేశ్ ప్రపంచంలోని తెలుగు వారికి పిలుపు నిచ్చారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.