ఉసిళ్ల పుట్ట మాదిరి ఉద్యోగులు.. మిలియన్ మార్చ్ గుర్తొచ్చిందా జగన్?

Publish Date:Feb 3, 2022

Advertisement

చలో విజయవాడ ప్రోగ్రామ్ లో కదం తొక్కుతున్న ఉద్యోగులను చూస్తుంటే ఓ పాత జ్ఞాపకం గుర్తొస్తుంది ఎవరికైనా. ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదేళ్ల క్రితం జరిగిన మిలియన్ మార్చ్ గుర్తుకు రావాల్సిందే. ఉద్యోగులు, ఉద్యమకారులు పక్కా ప్లాన్ తో అనుకున్న టైంకి ఎలా చేరుకోవాలో ప్రిపేరయ్యారు. అడుగడుగునా పోలీసులుంటారు కాబట్టి ట్యాంక్ బండ్ మీదికి ఎలా చేరుకోవాలో మందే భారీ పథకం సిద్ధం చేసుకున్నారు. ముళ్లకంచెలు, ముందస్తు అరెస్టులు.. ఇవన్నీ ముందు ఊహించినవే. అవెలాగూ ఉంటాయి. అయినా అనుకున్న చోటుకు వెళ్లి తీరాలి అనేదే వారి దృఢ సంకల్పం. అందులో భాగంగా ఉద్యోగులు, ఉద్యమకారులు వివిధ టీములుగా విడిపోయారు. ఏ టీము ఎక్కడ ఉండాలో క్రితం రోజు రాత్రే చేరుకున్నారు. ఎవరు ఏ టైమ్ కి ఎటువైపు నుంచి ట్యాంక్ బండ్ మీదికి రావాలో ముందే అనుకున్నారు. ఒక్కొక్కరు, ఇద్దరిద్దరు సాధారణ పౌరుల్లా నెమ్మదిగా ట్యాంక్ బండ్ వైపు కదిలారు. ఒక్కొక్క మనిషే కనిపిస్తున్నా... కొన్ని నిమిషాల్లోనే లెక్కలేనంత మంది జమయ్యారు. జనసంద్రాన్ని తలపించారు. పోలీసులు చేతులెత్తేశారు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ కూడా లైవ్. 

సరిగ్గా అలాంటి దృశ్యమే ఇవాళ విజయవాడలో కనిపించింది. కొత్త పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీనే ముద్దని, తాజా ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. సమ్మెకు ముందు ప్రిపరేషనల్ సమ్మిట్ గా చలో విజయవాడను సక్సెస్ చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపాలనుకున్నారు. సక్సెస్ అయ్యారు. పోలీసుల కళ్లుగప్పి, వారి దృష్టిని దారి మళ్లించి ఉద్యోగులంతా బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోవడం అచ్చంగా ఓ డిటెక్టివ్ సినిమాను తలపిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. 

రైతుల వేషంలో కొందరు, వికలాంగుల వేషంలో కొందరు, బిచ్చగాళ్ల వేషంలో మరికొందరు, సామాన్య సిటిజన్లలా మరికొందరు, దారిన పోయే దానయ్యల్లాగా ఇంకొందరు... ఇలా అందరూ కూడా ఉద్యోగస్తుల్లా కాకుండా మారువేషాల్లోనే సమావేశ స్థలానికి చేరుకోవడం నిజంగా ఓ చారిత్రక ఘట్టం. 

కాబట్టి ఇప్పటికైనా సర్కారు ఉద్యోగుల సరైన డిమాండ్లను పెద్దమనసుతో అంగీకరించి చర్చలకు ఆహ్వానించి ఓ పరిష్కరాన్ని కనుగొంటే బాగుంటుంది. లేకపోతే.. అదిగో ఆనాడు మిలియన్ మార్చ్ ఘటనలాగే... ఇక్కడ విజయవాడలో ఉద్యోగులంతా ఉద్యమకారులై రోడ్డెక్కారు. కాబట్టి విఫలమయ్యే కొశ్చనే లేదంటున్నారు ఏపీ ప్రజలు. దీన్నంతా పరిశీలిస్తున్న జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.