ఆంధ్రా మేదావి... ఆటలో అరటిపండు అవుతారా?

Publish Date:Sep 8, 2016

Advertisement

ఆయన దేవదాసులా వుంటాడు! కాని, పాపం ఆయనది లవ్ ఫెయిల్యూర్ కాదు! భుజాన శాలువా వేసుకుని భోరున తన్నుకొస్తున్న ఏడుపును అణిచిపెట్టుకుని ఆయన టీవీ స్టూడియోల్లో తిరుగుతుంటాడు! అయినా ఆయన బాధ మీరనుకున్నట్టు తాళలేని విరహం కాదు! ఆయన ఉద్వేగమంతా, ఉక్రోషమంతా, నిర్వేదమంతా, నిర్లిప్తతంతా ఆంద్రప్రదేశే! అవును... ఆంధ్రుల అలుపెరగని, అందరికీ తెలిసిన, ఎవ్వరికీ అర్థం కాని, ఏకైక మేధావి... చలసాని శ్రీనివాస్! ఎవరీయన? ఏంటి ఆయన తహతహ? ఇవేనా మీ ప్రశ్నలు... నిజానికి మా కొశన్స్ కూడా అవే!

ఆంద్ర మేధావుల సంఘం తరుఫున కాలికి బలపం కట్టుకుని తిరిగే చలసాని వారి మహోన్నత ఉద్దేశ్యాల్ని ఎవ్వరం తప్పు పట్టలేం. తమ సంఘంలో మరో మేధావి ఎవరైనా వున్నారా లేదా అన్నది ఆయనకే తెలియాలి. కాని, ఆ విషయం పక్కన పెడితే... ఈ ఒంటరి ఆంధ్రా మేధావి అతనే ఒక సైన్యం అన్నట్టు పోరాటం చేస్తుంటాడు. తనను ఆస్థాన ప్యానలిస్టుగా పిలిచే టీవీ స్టూడియోలకి ఓపికగా వెళుతుంటాడు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా గళం విప్పేవాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పరితపించిపోతున్నాడు. ఇది సంతోషకర విషయమే! కాని, ఇక్కడే చలసాని వారి మార్కు మేధావి ట్విస్ట్ వుంది!

చలసాని శ్రీనివాస్ డ్రెస్సింగ్, ఆయన వేసుకునే శాలువా ఎప్పుడూ ఒకేలా వుంటాయి! ఆయన ముఖంలోని బాధాతప్త ఎక్స్ ప్రెషన్ కూడా ఏ మాత్రం మారదు! కాని, ఆయన అభిప్రాయాలే పదే పదే మారిపోవటంతో ఆంద్ర ప్రజలు అవాక్కైపోతున్నారు! తెలంగాణ ఏర్పాటు సందర్భంగా మన మీడియా ఛానళ్లు చర్చల పేరుతో వీరంగం వేస్తుంటే ఈయన జై అంధ్రా అంటూ వెళ్లేవాడు. దాంతో చలసాని తమకు పనికొస్తాడని కొంత కాలం తెలంగాణ వాదులు కూడా భ్రమపడ్డారు. కాని, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిందే కాని హైద్రాబాద్, నది జలాలు, ఉద్యోగాలు, నిధులు వగైరా వగైరా అంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు. చివరకు, జై అంధ్రా అంటూ మొదలు పెట్టిన మన మేధావి సార్ సమైక్యాంధ్ర ఉద్యమకారులతో అన్ని మీటింగుల్లో పాల్గొన్నాడు. తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ వాదుల ముందు బుక్కయ్యాడు. పోనీ ఇటు ఆంధ్ర ప్రజలు ఏమైనా ఈ శాలువా సార్ ని శాలువా కప్పి సత్కరించారా అంటే... ఆయన వాదనేంటో అర్థం కాక అలా వదిలేశారు!

రాష్ట్రం రెండు ముక్కలై ఇప్పుడు ప్రత్యేక హోదా రాద్ధాంతం నడుస్తోంటే... చలసాని , ది మేధావి, అలుపెరుగక మరోసారి ఉద్యమం మొదలుపెట్టాడు! ఈ సారి కూడా ఆయనతో అదే ప్రాబ్లం. ఆయన ఏం చెబుతున్నాడో, ఎవరికి చెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో ఏమీ అర్థం కాదు. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టే టీవీ చర్చాసురులకైనా తెలుసో... లేదో!
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఈ ముక్క చెప్పటానికి చలసాని అంతటి మేధావి ఎందుకు? ఎవరైనా చెబుతారు! బీజేపి ఇవ్వటం లేదు. ఆ పార్టీ ఈయన మాట వినేలా ఆంద్ర మేధావుల సంఘం తరుఫున ఏం చేస్తున్నాడు? అది ఆ సెగని ఎదుర్కొంటోన్న మోదీకి తెలియాలి! సాయంత్రం టీవీ చర్చలు సరే... పొద్దున్నంతా చలసాని వారి ఉద్యమ కార్యాచరణ ఏంటి? ఇది ఎవ్వరికీ తెలియదు! ఆయన ప్రత్యేక హోదా తెచ్చే బాద్యత భుజాన వేసుకున్నానంటాడు కాని... భుజం పై శాలువా తప్ప క్లారిటీ అస్సలు కనిపించదు!

చలసాని శ్రీనివాస్ ను ఒక మహా మేధావిగా... ఆయన గతంలో ఏం సాధించాడో పెద్దగా తెలియకున్నా... ఆంధ్ర ప్రజలు చక్కగా గౌరవిస్తారు. మీడియా సాక్షిగా ఇది అనుమానం అక్కర్లేని సత్యం! కాకపోతే, ఇప్పుడు ప్రత్యేక హోదా రాలేదని కుంగిపోతోన్న తెలుగు ప్రజల బాధంతా ఒక్కటే... ఢిల్లీలోని కేంద్రంతో సాగోతోన్న ఈ మహా కురుక్షేత్రంలో చలసాని ఇంకెంత కాలం యుద్ధం చేస్తాడు? అదీ... గాల్లో కత్తి తిప్పుతూ... తనకు తానే సృష్టించుకున్న పద్మవ్యూహంలో చిక్కుకుని...  రాజకీయ పెద్దలెవ్వరూ పట్టించుకోకుండా... ఎంత కాలం పోరాడతాడు? చివరకు, కొంపదీసి... ఈ నిఖార్సైన నిజాయితీగల టీవీ స్టూడియోల తాలూకూ మేదావి... ఆటలో అరటిపండు అయిపోడు కదా? శ్రీనివాసా... గోవింద!    
 

By
en-us Political News

  
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో  పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు...
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ...
ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.