సీఎస్‌పై వేటు తప్పదా?

Publish Date:Apr 8, 2022

Advertisement

సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చింది అంటే ఇదే నేమో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం పై రాజకీయ యుద్ధం ప్రకటించారు. వరితో మొదలైన వివాదం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు.ఆయన అక్కడ ఏమి చేస్తున్నారో,ఎవరికీ తెలియడం లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళక ముందు, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  సమావేశమవుతారని , వార్తలొచ్చాయి. అయితే, ఈనాలుగు రోజులలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే, అలాంటి అవకాశం లేదనే అనిపిస్తోందని అంటున్నారు. ఒక విధంగా చూస్తే పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడిలా కేసీఆర్ వరివ్యూహంలో చిక్కుకు పోయారని, ఇప్పుడు ఎంతోకొంత గౌరవప్రదంగా బయట పడే మార్గం కోసం చూస్తున్నారని అంటున్నారు. 

అదలా ఉంటే, కేసీఆర్’కు చెక్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం, బెంగాల్  ఫార్ములాను సిద్ధం చేస్తోంది. ఢిల్లీ నుంచి  అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న వజ్రాయుద్ధాన్ని సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. గవర్నర్ తమిళి సై  ప్రోటోకాల్ వివాదం ఢిల్లీ చేరిన నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై, ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలపన్ బంద్యోపధ్యాయ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల గీత దటి విధేయతను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు. చివరకు ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన సమయంలోనూ, మమతా బెనర్జీ ఆడించిన రాజకీయ క్రీడలో పావుగా మారి సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆయన రిటైర్మెంట్’కు రెండు రోజుల ముందు, కేంద్ర ప్రభుత్వ, డిపార్టుమెంటు అఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ – డీఓపీటీ, ఇచ్చిన  ఎక్స్టెన్షన్ రద్దు చేసి రీకాల్ చేసింది. అయితే మమతా బెనర్జీ ఆయన్ని మూడేళ్ళ కాలానికి రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా నియమించారు. కానీ, ఇప్పటికీ కూడ ఆయన సర్వీస్ నిబంధనలకు సంబదించిన చిక్కుల నుంచి పూర్తిగా బయట పడలేదు. 

సోమేశ్ కుమార్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే విధంగ వ్యవహరిస్తుందా,  రీకాల్ చేస్తుందా అనే చర్చ అధికర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్’ను ఢిల్లీ పిలిపించిన సందర్భంలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్  ఉల్లంఘనలను చాలా సీరియస్ తీసుకుందని, ముఖ్యంగా ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవహర సరళి పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగ ఆయన మెదడ వేతు వేస్తుందని అధికార వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. నిజానికి సోమేశ్ కుమార్, ఆంధ్రా క్యాడర్ అదికారి, కాబట్టి ఆయన్ని వెనక్కి పిలిపిలిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తు అనుమతి కూడా అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. మరో వంక టాలీ వుడ్ డ్రగ్స్ కేసు సహా అనేక ఇతర్ కేసుల్లో చీఫ్ సెక్రెటరీ హోదాలో ఆయన, కోర్టు దిక్కరణ ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. సో .. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం పై ప్రకటించిన రాజకీయ యుద్ధం చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై వేటుతో, మరో దశకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.