భారీ నిర్మాణాలు నిలిపివేతకు కేంద్రం నిర్ణయం.. అమ‌రావ‌తి ప‌రిస్థితి ఏంటి?

Publish Date:May 13, 2026

Advertisement

రెండేళ్ల వ‌ర‌కూ పెద్ద పెద్ద నిర్మాణాలు చేయ‌వ‌ద్ద‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది . సెంట్ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం సైతం నిలుపుద‌ల చేసింద‌న్న వార్త‌లు వినవస్తున్నాయి. దీంతో అమ‌రావ‌తి నిర్మాణం ప‌రిస్థితి ఏంటి?  అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  పశ్చిమాసియా సంక్షోభం పెరుగుతున్న నిర్మాణ వ్యయాల దృష్ట్యా నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్ వంటి ప్రధాన ప్రాజెక్టులను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని నీతి ఆయోగ్   సూచించింది.  ఈ సూచన  నేపథ్యంలో కేంద్రం భారీ నిర్మాణాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.   కేంద్ర‌మే తాము నిర్మిస్తున్న భారీ నిర్మాణాల‌ను నిలిపివేయడంతో..  ఇప్పుడు అందరి దృష్టీ అమరావతిలో సాగుతున్న నిర్మాణాలవైపు మళ్లింది.  

అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం  15 వేల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించింది.  అలాగే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకుల నుంచి 26వేల‌ కోట్ల మేర నిధుల సేకరణ ప్రక్రియ కూడా  సాగుతోంది. ఇవి నిర్దిష్టంగా అమరావతి కోసం కేటాయించినవే కాబట్టి  ఇతర కేంద్ర భవనాల నిలుపుదల ప్రభావం దీనిపై ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.  అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లకు సంబంధించిన పనులు ఇప్పటికే  వేగంగా జరుగుతున్నాయి.  

రాష్ట్ర క్యాబినెట్ సుమారు ఐదు వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన పనులకు ఇటీవలే పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కామ‌న్ సెంట్ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్ పేరిట‌ అమరావతిలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం రూ. 2,534 కోట్లతో నిర్మాణానికి కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొన్ని భవనాల కూల్చివేత, పునర్నిర్మాణాలను వాయిదా వేసినప్పటికీ, అమరావతి వంటి అభివృద్ధి చెందుతున్న రాజధానుల్లో ఈ పనులు కొనసాగే అవకామే ఎక్కువగా  ఉందంటున్నారు పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2026 ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం చట్టబద్ధం చేసింది. కాబట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ ప్రాజెక్టును ఆపడం వల్ల రాజకీయంగా, ఆర్థికంగా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో పనులు ఆపమని కేంద్రం కోరే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు.

ఢిల్లీలో పాత భవనాల పునర్నిర్మాణంపై ఉన్న ఆంక్షలు, అమరావతి వంటి కొత్త రాజధాని నిర్మాణాలకు   వర్తిస్తాయనడం సరికాదు. ఎందుకంటే ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్. అయితే..  అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడిసరుకుల ధరలు పెరిగితే, పనుల వేగంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చుకానీ, పనులు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఎంత మాత్రం లేవని అధికారులు చెబుతున్నారు.   అమరావతి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారికంగా కొత్త ఉత్తర్వులు వెలువడితే తప్ప పనులు యథావిధిగా సాగడానికి ఎటువంటి అడ్డంకులూ లేవని సీఆర్డీయే అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.