రైతులు వద్దన్నవి తీసేస్తామన్న తోమర్ ! వ్యవసాయ చట్టాలపై దిగొస్తున్న సర్కార్
Publish Date:Dec 23, 2020
Advertisement
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి కేంద్రం దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. నిరసన చేస్తున్న రైతులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్ర నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న సందిగ్ధానికి వీలైనంత తొందరగా పరిష్కారం కావాలని, దానికోసం తాను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని తోమర్ అన్నారు.వ్యవసాయ రంగంలో లోటు పాట్లను సరి దిద్దుతామని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. ప్రస్తుతం కొన్ని సంస్కరణలు చేపట్టామనీ..భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకు వస్తామని తెలిపారు. రైతులకు మెరుగైన పంట ధర లభించేలా సంస్కరణలు చేపడతామని వెల్లడించారు. రైతు సంఘాలు తమ చర్చల ప్రతిపాదనను అంగీకరిస్తారని భావిస్తున్నానని తెలిపారు. చట్టాల్లో వారు కోరుకున్న మార్పులు, చేర్పులు తమకు తెలియబరచాలని కోరారు. రైతులు కోరకున్న సమయంలో చర్చలకు తాము సిద్దమని ప్రకటించారు నరేంద్ర సింగ్ తోమర్. 'మాప్రతిపాదనలపై రైతులు చర్చిస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్లు ఏం కావాలనుకుంటున్నారు, ఏం వద్దనుకుంటున్నారో చెప్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వారు కొరుకున్నవి చట్టంలో చేర్చి, వద్దన్నవి తీసేస్తాం. ఈ విషయమై వారితో చర్చిందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తేదీ, సమయం రైతులే నిర్ణయించుకోనివ్వండి. వారు కోరినప్పుడే చర్చలు చేస్తాం. ప్రస్తుతం ఉన్న సందిగ్ధానికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను ' అని కేంద్ర మంత్రి తోమర్ అన్నారు.
http://www.teluguone.com/news/content/central--ready-to-talks-with-farmers-on-agriculture-bills-39-108070.html





