మాటలు కోటలు దాటుతాయి.. అడుగు మాత్రం గడప దాటదు అన్నట్లుగా ఉంది కేంద్రం తీరు. కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఆ విషయంలో ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. బుడమేరు, కృష్ణా నది వరదలలో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిన సంగతి విదితమే.
ముఖ్యంగా విజయవాడ నగరం బుడమేరు వరదతో చిగురుటాకులా వణికి పోయింది. లక్షల మంది రోజుల తరబడి వరద నీటిలో అష్టకష్టాలూ పడ్డారు. ఆస్తుల నష్టపోయారు. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకూ జాతీయ విపత్తు నిధి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన వరద నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా జరిగింది. ఆసందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బెజవాడ వరద విపత్తుని మాటలకందని విషాదంగా అభివర్ణించారు. అయితే పర్యటన ముగించుకుని హస్తిన వెళ్లిన తరువాత ఆయన మౌనముద్ర వహించారు.
సెప్టెంబర్ 1,2 తేదీలలో విజయవాడ భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వరదల కారణంగా రూ. 7600 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపింది. ఈ వరదలలో 74 మంది మరణించారు. 2.82 లక్షల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యారు. 7 లక్షల మంది పునరావాస కేంద్రాలలో తలదాచుకున్నారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం. అనేక పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు చనిపోయాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర అధికారులు వరద తీవ్రతను, నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇవన్నీ జరిగి నెల రోజులు అయినా ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఒక్క పైసా సహాయం కూడా అందలేదు. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ప్రస్తావించారు. వెంటనే రాష్ట్రానికి 7600 కోట్ల రూపాయలు వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-support-nil-for-flood-effected-ap-39-185964.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?