అప్పులపై కేంద్రం, రాష్ట్రాల పరస్పర నిందా పర్వం

Publish Date:Jul 29, 2022

Advertisement

చవటాయను నేను.. నీకంటే పెద్ద చవటాయను నేను అని పాత సినిమాలో ఓ పాట ఉంది. ఇప్పుడు దానినే కొంచం తిరగేసి కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు పాడుకుంటున్నట్లుగా ఉంది. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాలను నిందిస్తుంటే.. గురివింద గింజ సామెతలా ఉంది కేంద్రం తీరు అంటూ రాష్ట్రాలు నిప్పులు చెరుగుతున్నాయి.  

 అప్పుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య నడుస్తున్న రగడ నేను చవటనే కానీ నాకంటే మీరు మరింత పెద్ద చవట అని పరస్పర నిందన యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం రాష్ట్రాల అప్పులను ప్రశ్నిస్తుంటే.. మా సంగతి సరే మీ సంగతేంటని రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.  మీరు అప్పులు ఎక్కువ చేశారంటే మీరు ఎక్కువ అప్పులు చేశారంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రజలు దొందూ దొందే అనుకుని పరిస్థితి కల్పించారు. అప్పుల తగాదాలోకి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ చేరవు. అలా చేరాల్సిన అవసరమూ వాటికి లేదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట ఆయా రాష్ట్రాల నిబంధనల ఉల్లంఘనను, అప్పుల అరాచకాన్ని కేంద్రం ఎత్తి చూపుతుంటే... అప్పుల విషయంలో కేంద్రం చిల్లులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిగ్గు తేలుస్తున్నాయి.

ఈ మోత్తం రగడలో రాష్ట్రాల తప్పిదాల కంటే కేంద్రం తప్పిదమే ఎక్కువ ఉందని పరిశీలకులు ఖరాఖండీగా చెప్పేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల అప్పులకు కేంద్రం అనుమతి ఉండాలి. నిబంధనలకు మించి ఒక్క రూపాయిఎక్కువ అప్పు చేయాలన్నా గ్రీన్ సిగ్నల్ఇవ్వాలి. ఇంత కాలం గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం, రాష్ట్రాలు ఇష్టారీతిన అప్పులు చేసేసి తీరా చేతులు కాలక తప్పదన్న పరిస్థితి వచ్చే సరికి ఆకుల కోసం వెదుక్కుంటున్నాయి. శ్రీలంక పరణామలు సంభవించి ఉండక పోతే కేంద్రం, రాష్ట్రాలూ కూడా తోడు దొంగల్లా అప్పు భారతీయాన్ని అలా కొనసాగిస్తూనే ఉండేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అప్పులపై పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటన చేసిన రోజునే.. ఏపీకి పెద్ద మొత్తంలో అప్పుకు అనుమతించడమే నిదర్శనంగా పరిశీలకులు చూపిస్తున్నారు. నిజమే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఎఫ్ ఆర్ఎంబి( ఫెనాన్స్ రెస్బాన్స్ బులిటీ- బడ్జెట్ మేనేజ్ మెంట్)ను మించి అప్పులు చేశాయి. విచ్చల విడిగా ఆర్థిక క్రమశిక్షణకు తిలోదకాలిచ్చి మరీ ఉచిత హామీలు నెరవేర్చి తదుపరి ఎన్నికలలో విజయానికి పెట్టుబడిగా ఉపయోగించేశాయి.

కానీ ఆ రాష్ట్రాలు అలా చేయడానికి కారణం కేంద్రం చూసీ చూడనట్లు వ్యవహరించడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేంద్రం, రాష్ట్రాలూ రెండూ కారణమేనని వారు వివరిస్తున్నారు. ఇంత కాలం కేంద్రం, రాష్ట్రాలూ కూడా తేలుకుట్టిన దొంగల్లా అప్పుల విచ్చలవిడితనంపై మౌనంగా ఉండి.. శ్రీలంక సంఘటనలతో ఒక్కసారి ఉలిక్కిపడి తప్పు మీదంటే మీదని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ పంచాయతీ అని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పరిమితిని మించి అప్పులు చేశాశాయంటే కేంద్రం, ఆర్బీఐ ఎత్తి చూపిన రాష్ట్రాలలో దాదాపు అన్నీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలే కావడం వెనుక ఉన్నది రాజకీయ కారణమే తప్ప మరొకటి కాదనడంలో సందేహాలకు తావులేదని వాస్తవమే అయినా.. ఆయా రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయనడంలోనూ, అందుకు పరిమితికి మించిన అప్పులే కారణమనడంలోనూ ఎటువంటి సందేహమూ లేదు. రాష్ట్రాల పరిస్థితి ఎలా తయారైందంటే.. చేసిన అప్పులు తీర్చడం మాట అటుంచి వాటికి వడ్డీలు కట్టడానికే మళ్లీ  అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది రాష్ట్రం పరిస్థితి అయితే కేంద్రం ఏం తక్కువ తినలేదు. ఈ సంగతీ తమను వేలెత్తి చూపిన కేంద్రంపై రాష్ట్రాలు ప్రతి విమర్శలు చేయడంతోనే బయట పడింది.

కేంద్రం రుణాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల చేతనే  ఇంత కాలం కేంద్రం రాష్ట్రాల అప్పులపై నోరెత్తలేదు. అలాగే కేంద్రం రుణాలపై రాష్ట్రాలు నోరెత్త లేదు. ఇప్పుడైనా కేంద్రం, రాష్ట్రాల బండారం బయటపడటానికి శ్రీలంక పరిణామాలే కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో జనాలకు వెల్లడయ్యేందుకు కారణమైన శ్రీలంకకు ప్రజలు ధ్యాంక్స్ చెప్పుకోవాలి.కేంద్రం అప్పులూ దేశాన్ని దివాళా దిశగా తీసుకు వెళ్లేలాగే ఉన్నాయనడానికి ఆ అప్పులు దేశ   స్థూల జాతీయోత్పత్తిలో 60 శాతానికి మించిపోవడమే తార్కానం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం తన ఖాతాలోనే జమ వేసుకుంటూ రాష్ట్రాలు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోవడానికి పరోక్షంగా కేంద్రమే కారణమైంది. అవి చాలవన్నట్లు  విదేశీ బాండ్ల రూపంలో అప్పుల సేకరణ లేదా సమీకరణకు కేంద్రం తెరతీసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది.

ఇవన్నీదేశ  ఆర్థిక వ్యవస్థ వేగంగా సంక్షోభం దిశగా పయనిస్తున్నదనడాకి తార్కానాలు. ఇంత పంచాయతీ జరుగుతున్నా కేంద్రం, కానీ రాష్ట్రాలు కానీ అప్పులను నియంత్రించుకుని పొదుపు పాటించాలని భావించడం లేదు. వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలూ కూడా జనాలకు నగదు పంపిణీయే పెట్టుబడి అని భావిస్తున్నాయి. దేశం మరో శ్రీలంక అయినా వాటికి పట్టింపు లేదు. అధికారం చేజిక్కించుకుంటే చాలు అన్న ధోరణిలోనే ఉన్నాయి. ఒక చేత్తో ఉచితాల పేరున ప్రజలకు పంపిణీ చేస్తున్న ప్రభుత్వాలే మరో వైపునుంచి జనం నుంచి పన్నుల రూపంలో రెండు చేతులా పిండేస్తున్నారు.  

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.