Publish Date:Jul 19, 2022
ఊరించి ఊరించి ఊరగాయ బెట్టి ఆఖరికి ముక్కలేదు తర్వాత చూద్దాం అని నూనె జాడీ చూపించింది వెనకటికి ఓ బామ్మగారు. అదుగో అలా మారింది ఆంధ్రప్రధేశ్ ప్రత్యేక హోదా తంతు. 2014లో ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామన్న హామీ ఇచ్చారనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా విడిపోవడానికి అప్పటి నాయకులు అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటయింది. అప్పటి నుంచి హోదా గురించి ఎప్పుడు చర్చ లేదా ప్రశ్నలు తలెత్తినా ఏదో మాయమాటలు చెప్పి తెలుగు ప్రజల, ప్రభుత్వ ఆవేశాన్ని చల్లా ర్చడం కేంద్రం పెద్ద పనిగా పెట్టుకుంది. కాలం గడిచిపోయింది రాష్ట్రానికి వీలయినంత ఆర్ధిక సాయం చేస్తామని ఊరించి అసలు హోదా మాటనే మర్చిపోయేలా చేశారు కేంద్రంలోని బిజెపీ పెద్దలు.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా సాధించుదామనే అన్నారు. కానీ క్రమేపీ కేంద్రానికి దాసోహం అనడంతో ఆ మాటను మార్చి ఏవేవో కబుర్లు చెబుతూ, జగన్‌ని అసలా అంశాన్ని ఎత్తకుండా చేశారు. జగన్ కేవలం కేంద్రంలో నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప ప్రత్యేక హోదా గురించి ఇతర అంశాల గురించి పల్లెత్తు ఏమీ మాట్లాడటం లేదు. జనం పూర్తిగా దాని సంగతే మర్చిపోయారన్న భ్రమలో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రత్యేక హోదా అంశం చర్చకు తెరలేపింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వంమళ్లీ పాత పాటే పాడింది. లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు.
రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.
...
హోదా సాధనకు ఒక సుధీర్ఘ పోరాటాన్ని వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలతో సహా అన్ని పార్టీలు తమ విభేదాలను వీడి ఎస్సీ ఎస్‌ఎస్ సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకు అత్యధికంగా ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కోసం పాటుపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఇప్పుడు మౌనంగా ఉండటం పట్ల రాష్ట్రంలో విపక్షాలతో పాటు ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంలో బిజెపీని దీటుగా ఎదర్కోవడంలో వైసీపీ ని పూర్తిగా నమ్మి మోసపోయామన్న అభిప్రాయాలే అంతటా వినవస్తున్నాయి. కేంద్రంతో కొంత సహచర్యం వున్న జగన్ హోదా విషయంలో మాత్రం వారిని ఒప్పించడంలో దారుణంగా విఫలమయ్యారు. పైగా కేంద్రం మనసులో మాట జగన్‌కు తెలిసి కావాలనే అసలు రహస్యాన్ని బయటపెట్టక కాలక్షేపం కబుర్లతో ప్రజల్ని మోసం చేశారన్నది తేటతెల్లమయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-shows-empty-hands-to-ap-again-on-special-status-25-140113.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.