మా పథకాలకు మీ బొమ్మలా? నిధులు నిలిపేసి జగన్ సర్కార్ కు కేంద్రం షాక్!

Publish Date:Nov 7, 2023

Advertisement

అసలు ఈ రంగులు, బొమ్మల పిచ్చేంటో కానీ తొలి రోజు నుండే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఈ అంశంలో విమర్శలపాలవుతూనే ఉంది. అయినా, ఆ విమర్శలను ఖాతరు చేయకుండా ప్రతి దానిలో వైఎస్ జగన్ బొమ్మలు, వైఎస్ఆర్ పేర్లు ఉండేలా చూసుకుంటోంది. ప్రభుత్వ భవనాలకు కూడా వైసీపీ రంగులను పూస్తున్నారు. పలుమార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నా జగన్ సర్కార్ కు పట్టలేదు. చివరికి రాష్ట్ర పథకాలతో పాటు కేంద్ర పథకాలకు కూడా ఈ పేర్లు, బొమ్మలను తగిలించి ఆ పథకాల క్రెడిట్ కూడా మనదే అనేలా కలరింగ్ ఇస్తున్నారు. అయితే  అన్ని రోజులు మనవే కాదు కదా. ఈ మధ్య కాలంలో కేంద్రం కాస్త ఏపీ ప్రభుత్వంపై దృష్టి పెట్టింది. తమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందనేది నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్ర నిధులను దారి మళ్లించడాన్ని గుర్తించి ఆ మధ్య పలుమార్లు సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది. లెక్కా పత్రం లేకుండా ఇలా కేంద్ర నిధులను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ఏంటని  తీవ్రంగా మండిపడింది.

అదలా ఉండగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను  నిలిపివేసింది. మా నిధులను మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం ఏంటని ఏకంగా రూ.4 వేల కోట్ల రూపాయలను నిలిపివేసింది. కేంద్ర పథకాల పేర్లు మార్చి  మీ బొమ్మలేసుకొని అమలు చేయడం ఏంటంటూ నిధులను నిలిపివేసింది. అసలే తీవ్ర ఆర్ధిక ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల వేళ కేంద్రం షాక్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర నిధులతో చేపడుతున్న పథకాలకు.. కేంద్రం పేరే ఉండాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం తమ పథకాలపై నవరత్నాల లోగోలు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ బొమ్మలు ఉంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఆ బొమ్మలు పెడితే నిధులు ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ముంగిట జగన్ సర్కార్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్లు అయ్యింది. 

నిజానికి ఏపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో చాలా పథకాలలో సింహభాగం కేంద్ర నిధులే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కేంద్రం పథకాలను పేర్లు మార్చేసి, వైసీపీ రంగులు, జగన్ బొమ్మలేసుకొని కొంత భాగం రాష్ట్ర నిధులను కలిపి అమలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇదే. అయితే, వాటికి అట్టహాసంగా బటన్ నొక్కుడు కార్యక్రమాలు నిర్వహించి తమ సొంత పథకాలుగా జగన్ సర్కార్ ఆర్భాటం చేస్తూ వచ్చింది. ఉదాహరణకు గృహల నిర్మాణం విషయానికి వస్తే ఈ నిధులలో కేంద్రానిదే సింహభాగం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు సమకూరుస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు చాలా తక్కువ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు వైయస్సార్ పేరుని జోడించి పీఎంఏవై- వైయస్సార్ బీఎల్సీ పథకంగా మార్చింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ లోగోతో పాటు సీఎం జగన్ బొమ్మతో కూడిన నవరత్నాల లోగో  కూడా పెట్టింది.  

ఈ ఒక్క గృహ నిర్మాణాలే కాదు.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్, వాసన పథకాలకు కేంద్రం భారీగా సహకరిస్తోంది. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలు కేంద్ర సహకారంతోనే నడుస్తున్నాయి. రైతు భరోసాలో కూడా కేంద్ర నిధులున్నాయి. కానీ  గర్భిణీలకు, పిల్లలకు ఇచ్చే గుడ్లపై కూడా వైఎస్ఆర్ పేరు ఉండగా.. పాల ప్యాకెట్లపై జగన్, నవరత్నాల లోగోలున్నాయి. కేంద్ర నిధులున్నా యథేచ్ఛగా వైఎస్ఆర్ రైతు భరోసాగా పేరు పెట్టుకున్నారు. ఇలా కేంద్ర నిధుల అంశాన్ని దాచి పెట్టి తమ సొంత నిధులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వాన్ని మభ్య పెడుతూ వచ్చింది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో కేంద్రం బృందాన్ని పంపించి విచారణ చేపట్టగా బండారం బయటపడింది. దీంతో కేంద్రం నిధులు నిలిపివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ జీవో జారీ చేస్తూ నవరత్నాల లోగో కూడా తొలగించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కూడా బోర్డులు మారుస్తామని కేంద్రానికి నివేదించింది. మిగతా పథకాలలో కూడా మార్పులు చేస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పగా.. ఎన్నికల వేళ జగన్ కు ఇది  షాకేనని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.