బిజెపి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ప‌రాకాష్ట‌! కేంద్రం త‌వ్విపోసిన హెరాల్డ్ కేసు!

Publish Date:Jun 13, 2022

Advertisement

కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఇ.డి) విచార‌ణ‌కు పిల‌వ‌డంతో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌ల‌కు దిగింది. బిజెపి ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని  కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది.  అనారోగ్య కార‌ణంగా సోనియాగాంధీ ఇ.డి. విచార‌ణ‌కు హాజ‌రుకాలేక‌పోయారు. ఆమె ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా రాహుల్ గాంధీ సోమ‌వారం ఇ.డి. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.  ఇంత‌కీ ఈ నెష‌న‌ల్ హెరాల్డ్ కేసు ఏమిటో తెలుసు కుందాం.. 

 1937లో  నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను జవహార్‌లాల్‌ నెహ్రూ  ప్రారంభించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు గాంధీ, పటేల్‌, నెహ్రూ మూలస్తంభాలుగా నిలిచారు. నేషనల్‌ హెరాల్డ్‌ ఆర్థికంగా నిలదొక్కుకోడానికి  5 వేల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరందరికి నేషనల్‌ హెరాల్డ్‌లో షేర్లు ఉన్నాయి. పాలకుల ప్రజా కంటక నిర్ణయాలను నేషనల్‌ హెరాల్డ్‌ ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో బ్రిటీష్‌ వారికి ఇబ్బందికరంగా మా రింది. దీంతో 1942 నుంచి 1945 వరకు నేషనల్‌ హెరాల్డ్‌పై బ్రిటీష్‌ పాలకులు నిషేధం విధించారు.
త‌ర్వాత వరుస ఉద్యమాలతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నష్టాల పాలయింది. ఈ నష్టాలను పూడ్చుకునేం దుకు నేషనల్‌ హెరాల్డ్‌కు నాటి జాతీయ పార్టీ కాంగ్రెస్‌ రూ.90కోట్ల మేర విడతల వారీగా సాయం అందిం చింది. చాలాకాలం వీటిని పట్టించుకోని కాంగ్రెస్‌ పెద్దలు.. యూపీఏ 2 హయాంలో నేషనల్‌ హెరాల్డ్‌పై దృష్టి సారించారు.

2009 నాటికి నేషనల్‌ హెరాల్డ్‌లో మిగిలిన వాటాదారుల సంఖ్య కేవలం 1057 మంది మాత్రమే. అయితే నేషనల్‌ హెరాల్డ్‌కు ఢిల్లీతో పాటు పలు నగరాల్లో నడిబొడ్డున అత్యంత విలువైన ఆస్తు లున్నాయి. న్యూఢిల్లీలోని బహుదూర్‌ షా జఫర్‌ మార్గ్‌లో అత్యంత కీలకమైన ప్రాంతంలో హెరాల్డ్‌ హౌజ్‌ ఉంది. కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తుల గురించి వివరాలు 2009లో బయటికొచ్చాయి.
2010లో రూ.50లక్షల మూలధనంతో యంగ్‌ ఇండియన్‌ అనే కంపెనీని కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేశారు. సోనియా, రాహుల్‌కు 76 శాతం వాటా, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లకు 24 శాతం వాటాతో యంగ్‌ ఇండియన్‌ ఏర్పాటయింది. దీనికి కావాల్సిన రూ.50లక్షల మూలధనం కూడా సిద్ధంగా  లేకపోవ డంతో కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ దగ్గర రూ.కోటి లోన్‌ తీసుకుని మరీ సంస్థను ఏర్పాటు చేశారు. నేష నల్‌ హెరాల్డ్‌కు ఇచ్చిన అప్పును తీర్చలేని రుణంగా ప్రకటించిన ఏఐసీసీ.. దాన్ని యంగ్‌ ఇండియాకు రూ.50లక్షలకు ఇచ్చేసింది. అంటే నేషనల్‌ హెరాల్డ్‌ రూ.90 కోట్ల బకాయిలను యంగ్‌ ఇండియన్‌కు రూ.50 లక్షలకు అప్పగించింది. దీనికి సంబంధించి అటు ఏఐసీసీ తరపున, ఇటు యంగ్‌ ఇండియన్ తర పున,  నేషనల్‌ హెరాల్డ్‌ తరపున  కూడా  మోతీలాల్‌  వోరా ఒక్క‌రే  సంతకం చేయడం గమనార్హం. 
ఈ ఒప్పందంతో నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులన్నీ యంగ్‌ ఇండియన్‌ స్వాధీనం చేసుకుంది. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల ప్రస్తుత విలువ సుమారు రూ.5వేల కోట్లు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల వాటాలకు చెందిన కంపెనీలో భారీగా అవకతవకలు జరిగాయంటూ  2012లో ఢిల్లీ  కోర్టులో సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. అప్పట్లో ఈ  కుంభకోణాన్ని సుమారు రూ.1600 కోట్లుగా  లెక్కగట్టారు సుబ్రహ్మణ్యస్వామి. యంగ్‌ ఇండియ న్‌ కంపెనీ ఏర్పాటు ద్వారా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులన్నింటినీ సోనియా, రాహుల్‌ చేజిక్కించుకున్నారని ఆరోపించారు. 

ఈ కేసుకు సంబంధించి 2014లో సోనియా, రాహుల్‌, శ్యాంపిట్రోడాలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. 2016లో పటియాలా హౌజ్‌ కోర్టు నుంచి కాంగ్రెస్‌ నేతలు బెయిల్‌ తెచ్చుకున్నారు. 2019లో రూ.64కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. ఇప్పటికే సోనియా, రాహుల్‌లకు ఆదాయంపన్ను శాఖ నోటీసులిచ్చింది. ఐటీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయిం చింది. 2019లో సోనియా, రాహుల్‌లకు సుప్రీంకోర్టులో ఐటీ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. ట్రైబ్యునల్‌లో సోనియా, రాహుల్‌లకు వ్యతిరేకంగా పరిణామాలు చోటుకున్నాయి. సోనియా, రాహుల్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. 

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.