రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకొంటే కేంద్రానికి కూడా మేలే కదా

Publish Date:Apr 2, 2015

Advertisement

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత తొమ్మిది నెలలుగా డిల్లీ చుట్టూ చేస్తున్న ప్రదక్షిణాలకు ఫలితం దక్కింది. మార్చి 31న ఆర్ధిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల క్రింద సోమవారం నుండి బుధవారం వరకు మొత్తం రూ. 8, 375కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమా అయ్యాయి. వాటిలో రెవెన్యూ లోటు పూడ్చేందుకు రూ.1,800 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు, అమ్మకం పన్ను పరిహారం క్రింద రూ.544 కోట్లు, పుష్కరాల కోసం రూ.100 కోట్లు, వివిధ పద్దుల క్రింద మరో రూ.25-30కోట్లు రాష్ట్ర ఖజానాలో జమా అయ్యాయి. ఇవికాక 13వ మరియు 14వ ఆర్ధిక సంఘాల సిఫార్సుల మేరకు (2014-15; 2015-16 సం.లకి) కేంద్ర పన్నులలో వాటాగా మొత్తం రూ. 3, 080 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమా అయ్యాయి.

 

ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్రం నుండి నిధులు రాకపోతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా డబ్బు ఏర్పాటు చేసుకొనేందుకు సిద్దపడింది. కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే మార్చి 31వ తేదీ అర్ధరాత్రిలోగా రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల చేసింది. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండటం, కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల చేస్తుండటమనేది ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఆ కారణంగా తెదేపా, బీజేపీల మధ్య భేదాభిప్రాయాలు కూడా వస్తున్నాయి.

 

రాష్ట్రానికి సరయిన ఆర్ధికవనరులు ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తన స్వీయ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేయడం వలననే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్ష అనుభవిస్తున్నాయి. కానీ ఇప్పుడు జరిగిపోయిన దానిని తలుచుకొని చింతిస్తూ, కాంగెస్ పార్టీని నిందిస్తూ కూర్చోవడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.

 

కనుక ఈ సమస్యను అధిగమించాలంటే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగడమే తగిన పరిష్కారం కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రానికి కొన్ని చిన్నా,పెద్ద  పరిశ్రమలను రప్పించగలిగారు. మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. కానీ ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన అనేకమంది పారిశ్రామికవేత్తలు వేచిచూస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే సూచనలేవీ కనిపించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వమే నూతన పారిశ్రామిక విధానం ప్రకటించి పరిశ్రమలకు భారీ రాయితీలు కల్పించి వారిని కూడా రాష్ట్రానికి రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ పరిశ్రమలు స్థాపన జరిగి, వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడానికి కనీసం ఒకటి రెండు సం.లు పట్టవచ్చును. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఆధారపడక తప్పదు.

 

కనుక కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, వీలయినంత త్వరగా ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా అది వీలుపడదనుకొంటే అందుకు సరిసమానంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవలసి ఉంటుంది. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకొనేందుకు కేంద్రప్రభుత్వం అవసరమయిన సహాయ సహకారాలు అందించగలిగితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ సమస్య నుండి త్వరగా బయటపడగలవు. లేకుంటే వచ్చే ఎన్నికల వరకు వాటి మధ్య ఇదే తంతు కొనసాగడం తధ్యం. దాని వలన తెదేపా, బీజేపీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం తధ్యం. ఆ కారణంగా రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక దీనిని కేవలం రాష్ట్ర ప్రభుత్వ సమస్యగా మాత్రమే చూడకుండా కేంద్రం కూడా పూర్తి బాధ్యత స్వీకరించవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.