అనురాధ విజయంపై వైకాపాలో సంబురాలు

Publish Date:Mar 23, 2023

Advertisement

 అవును. మీరు చదివింది కరెక్టే. అందులో అచ్చు తప్పులేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. అది సహజం. కానీ టీడీపీ అభ్యర్ధి అనురాధ విజయంపై టీడీపీ  నాయకులు శ్రేణుల కంటే, వైసీపీ నాయకులు ఎక్కువ సంతోష పడుతున్నారు.

అయితే తెలుగు దేశం సంబురాలకు, వైసీపీ సంబురాలకు ఓ చిన్న తేడా అయితే వుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకుంటుంటే, వైసీపీ నేతలు లోలోపలే మురిసి పోతున్నారు. అదేదో సినిమాలో శృతిహాసన్ లోలోపల డాన్స్ చేసినట్లుగా, వైసీపీ నేతలు కొందరు లోలోపల ఏకంగా ఆనంద తాండవం చేస్తున్నారు. తెలుగు దేశం మిత్రులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 ఇంతకీ వైసీపీ నాయకులు ఎందుకు అంతగా సంతోష  పడుతున్నారంటే.. వారి  సంతోషానికి కారణం లేక పోలేదని అంటున్నారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో సంపూర్ణ ఓటమితో కొంత కిందికి దిగివచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ ఓటమితో మరో మెట్టు దిగివస్తారని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు ఎమ్మెల్యేలను చివరకు మంత్రులను కూడా చులకన చేసి మాట్లాడడం, తానొక్కడే పునీతుడు, సర్వ శక్తిమంతుడు మిగిలిన వారంతా పనికి మలిన వారు అన్న విధంగా వ్యవహరించడం వంటి ముఖ్యమంత్రి విపరీత పోకడలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇతర ముఖ్యనేతలు చాలా కాలంగా లోలోపల కుమిలి పోతున్నారు. అలా విసిగి పోయిన నాయకులు ఇప్పటికైనా జగన్ రెడ్డి దారికి వస్తారని ఆశిస్తున్నారు. అందుకే సంబురాలు చేసుకుంటున్నారని, అంటున్నారు. 

కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన అనురాధను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌ మేం 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశారు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నారు. చివరికి అదే 23వ తేదీన అదే 23 ఓట్లతో మీ ఓటమి.. మా గెలుపు. ఇది కదా దేవుడి స్క్రిప్ట్‌ అంటే అంటూ జగన్‌ను ఎద్దేవా చేశారు. తెదేపా అభ్యర్థి విజయం సాధించడం పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. వైకాపా పతనం ఆరంభమైందని అన్నారు.

By
en-us Political News

  
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.