Publish Date:Nov 12, 2024
జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది.
Publish Date:Oct 22, 2024
తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించింది. మద్యానికి బానిసలైన కుటుంబాలు దీనవస్థను ఎదుర్కొన్నాయి. గత డిసెంబర్ లో కెసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు .
Publish Date:Oct 22, 2024
మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తీరు గురువింద గింజమాదిరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అన్నట్లు.. తాను చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.
Publish Date:Oct 22, 2024
భారతదేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోన్న వేళ బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ నాయకత్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్న చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో.. ఆయన వారసుడిని ఎంపిక చేసే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు.
Publish Date:Oct 21, 2024
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో రెండు రోజుల క్రితం జరిగిన లాఠీ చార్జిపై బిజెపి సీరియస్ గా ఉంది బిజెపి నేత ఈటెల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది . మజ్లిస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు
Publish Date:Oct 21, 2024
కేసీఆర్... ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి.
Publish Date:Oct 21, 2024
పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు.
Publish Date:Oct 21, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. తన తీరు మార్చుకోక తప్పదని అర్ధమైంది. వైసీపీకి ఎటూ పొలిటికల్ ఫ్యూచర్ జీరో అని అవగతమైంది. ఇప్పుడు రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వినా మరో దిక్కు లేదని అవగతమైంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్ని ప్రకటనలు చేసినా.. అడగకుండానే ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా.. అటు నుంచి ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలిగా ఉన్న తన సొంత చెల్లి షర్మిల అనే విషయం బోధపడింది.
Publish Date:Oct 21, 2024
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక చకచకా సాగుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు.. మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక అమరావతి పనులు పరుగులు పెడతాయనడంలో సందేశం లేదు.
Publish Date:Oct 20, 2024
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి స్థానాలు దక్కకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మంచి ఫలితాలనే రాబట్టింది. ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదుగుతున్నట్లు బీజేపీ చాటింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది. ప్రధాన ప్రతిపక్షం తరహాలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ అధికార పార్టీకి సవాళ్లు విసురుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ గురి పెట్టింది.
Publish Date:Oct 19, 2024
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ 4వ సీజన్ రెడీ అయ్యింది. తొలి మూడు సీజన్లూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు సినిమాలలోనూ బాలయ్య అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. మరో వైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇక తన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపారేస్తున్నారు.
Publish Date:Oct 19, 2024
బెదరింపు కాల్స్ నేపథ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఖతం చేస్తామన్న బెదరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రూ.2కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ రూ. 5 కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు బెదరింపులు పంపిన సంగతి తెలిసిందే.
Publish Date:Oct 19, 2024
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయన్న ఆందోళన ఆయా పార్టీలలో వ్యక్తం అవుతోంది. బీజేపీ శాశ్వతంగా కేంద్రంలో అధికారంలో కొనసాగే వ్యూహంలో భాగంగానే.. జమిలి జపం చేస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటికే జమిలికి సై అనేశాయి.