యూఏఈలో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బాబు పెట్టుబడుల వేట

Publish Date:Oct 23, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో దూకుడు పెంచింది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విషయంలో  విజయవంతం అవుతోంది. నవంబర్ లో  విశాఖలో జగరనున్న  సదస్సుకు  ఏపీ సర్కార్ పలు సంస్థలను ఆహ్వానిస్తున్నది.  

భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు  ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా  మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటనలో బిజీగా ఉన్నారు.  కాగా వీరిద్దరి ప్రయత్నాలకూ ఆయా దేశాలలోని పారిశ్రామిక వేత్తల నుంచి  మంచి సానుకూలత లభిస్తోంది.  ఎనిమిదేళ్ల తరువాత ఏపీ రొయ్యలు ఆస్ట్రేలియాకు ఎగుమతి కావడానికి మార్గం సుగమమైందంటే అది లోకేష్ కృషి ఫలితమేనని చెప్పక తప్పదు. 

ఇక చంద్రబాబుకు అయితే పారిశ్రామిక వేత్తలు దుబాయ్ లో రెడ్ కార్పెట్ పరిచారనే చెప్పాలి. తన దుబాయ్ పర్యటనలో చంద్రబాబు  ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ట్రాన్స్ వరల్డ్ గ్రూప్  ఏపీలో షిఫ్ట్ బిల్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది. లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ సంషీర్ వయాలీల్ తో  సమావేశమయ్యారు. ఆ సంస్థ అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తోంది. ఏపీలో అత్యధునిక క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది.    ఇంకా చంద్రబాబు శుక్రవారం వరకూ యూఏపీలోనే పర్యటించనున్నారు.  ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రముఖ సంస్థలతో అక్కడే ఒప్పందాలు చేసుకుని గ్లోబల్ సమ్మిట్ లో వాటిపై ప్రకటనలు చేసేలా ముందుకు సాగుతున్నారు. 

ఇక గురువారం ఉదయం ఆయన అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో,  జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అలాగే  అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులనూ భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 23) యూఏఈలో ఆయన రెండో రోజు పర్యటన ఆద్యంతం బిజీబిజీగా సాగనుంది. 
  అబుదాబీలోని స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో  పాల్గొన్న అనంతరం,  మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో  సీఎం భేటీ కానున్నారు. అలాగే  లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతో కూడా   సమావేశమై విశాఖ, విజయవాడలలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చించనున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో సమావేశమవుతారు. అనంతరం యాస్ ఐలాండ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. నేడు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

By
en-us Political News

  
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.